వీకెండ్లో కోల్డ్ ప్లే కన్సర్ట్ తో ముంబై ఊగిపోయింది. గ్లోబల్ సిటిజన్ ఇండియా కార్యక్రమంలో అంటూ క్రిస్ మార్టిన్ ఇండియాలో ఇచ్చిన లైవ్ షో సూపర్ డూపర్ హిట్టైంది. ఈ ఈవెంట్ కి పాప్ లవర్సే కాదు బాలీవుడ్ స్టార్స్ కూడా క్యూ కట్టేశారు. అమితాబ్.. షారూక్ దగ్గర్నుంచి పరిణీతి చోప్రా వరకు అందరూ క్రిస్ సాంగ్స్ కి ఉర్రుతాలూగిపోయారు. ఏఆర్ రెహమాన్ తో వందేమాతరం అంటూ గొంతు కలిపి క్రిస్ ఇండియన్స్ మనసు దోచేశాడు. ఇక కన్సర్ట్ అయిపోయిన వెంటనే సీన్ ఈవెంట్ గ్రౌండ్ నుంచి షారూక్ ఇంటికి మారిపోయింది.
ఇంటర్నేషనల్ సెలబ్రిటీస్ ఎవరు ఇండియాకి వచ్చినా బాలీవుడ్ టాప్ లీగ్ ని మీట్ అవడం కామనే. వచ్చిన సెలబ్రిటీతో కాస్త పరిచయాలుంటే టాప్ హీరోల ఇళ్లలో పార్టీస్ కూడా సహజమే. ఈ సారి షారుక్ వంతు వచ్చింది. ఇండియా వచ్చిన కోల్డ్ ప్లే బ్యాండ్ కోసం గ్రాండ్ బాష్ ఏర్పాటు చేశాడు కింగ్ ఖాన్. ఇక షారూక్ ఇచ్చిన పార్టీకి ఎంటైర్ బాలీవుడ్ వాలిపోయింది. అందరూ షారూక్ బంగ్లా మన్నాత్ కి క్యూ కట్టేశారు.
సల్మాన్ ఖాన్.. దీపికా పదుకునే.. హృతిక్ రోషన్.. కత్రినా కైఫ్.. అర్జున్ కపూర్.. రణవీర్ సింగ్.. ఫర్హాన్ అక్తర్.. శ్రద్ధా కపూర్.. రానా దగ్గుబాటితో పాటు బోలెడంత మంది హీరో- హీరోయిన్స్ షారూక్ ఇంట్లో తళుక్కుమన్నారు. అసలే కోల్డ్ ప్లే అంటే మనోళ్లు పడిచచ్చిపోతారు. ఇక షారూక్ ఇంట్లో క్రిస్ తో పార్టీ చేసుకునే అవకాశమొస్తే ఎలా మిస్ చేసుకుంటారు. అందుకే శనివారం రాత్రి పదకొండున్నరకి మొదలైన హంగామా పొద్దున ఆరింటి వరకూ జరుగుతూనే ఉందంటే అందరూ ఏ రేంజ్ లో ఎంజాయ్ చేసి ఉంటారో ఊహించుకోవచ్చు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/