జానీ డెప్ కాదు, షారూక్ డెప్‌!

Update: 2018-09-09 08:14 GMT
కెరీర్‌ లో కింగ్ ఖాన్ చేయ‌ని ప్ర‌యోగ‌మే లేదు. విల‌న్‌గా న‌టించాడు. నెగెటివ్ షేడ్ ఉన్న పాత్ర‌లు చేశాడు. త‌ర్వాత హీరో అయ్యాడు. హీరో నుంచి స్టార్ హీరోగా ఎదిగాడు. ఎదురేలేని స్థానానికి చేరాడు. ఆకాశ‌మే హ‌ద్దుగా అత‌డు ఎదిగిన తీరు ఎంద‌రికో స్ఫూర్తి. ప‌రిశ్ర‌మ‌లో ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేక‌పోయినా ఇంతింతై అన్న చందంగా ఎదిగిన షారూక్ ఎదుగుద‌ల బ‌చ్చ‌న్‌ ల‌కు - ఖాన్‌ ల‌కు కంటి మీద కునుకు ప‌ట్ట‌నీకుండా చేసిందంటే అతిశ‌యోక్తి కాదు.

అందుకే ఎంద‌రు ఖాన్‌ లు ఉన్నా షారూక్ ఖాన్ వేరే. కింగ్ ఖాన్‌ త‌న కెరీర్‌ లో ఎన్నో విల‌క్ష‌ణ‌మైన పాత్ర‌ల్లో న‌టించి మెప్పించాడు. ఇప్పుడు ఏకంగా జీరో చిత్రంలో మ‌రుగుజ్జు పాత్ర‌లో న‌టిస్తూ అంద‌రికీ షాకిస్తున్నాడు. షారూక్‌ లోని వైవిధ్యానికి ఈ సినిమా ప‌రాకాష్ట‌గా ఉండ‌బోతోంద‌ని ఇదివ‌ర‌కూ రిలీజైన టీజ‌ర్ చెప్పింది. ఈ ఏడాది చివ‌రిలోనే ఈ చిత్రం రిలీజ్ కానుంది.

ఇదిగో జీరో రిలీజ్‌ కి ముందు అభిమానులు ఇలాంటి కొత్త‌ గెట‌ప్‌ తో షారూక్‌ ని ప్ర‌మోట్ చేస్తున్నారు. పైరేట్స్ ఆఫ్ ది క‌రీబియ‌న్ లో జానీ డెప్ లుక్ ఇమ్మిటేష‌న్‌ తో షారూక్‌ ని ఇలా డిజైన్ చేసి ట్విట్ట‌ర్ - ఎఫ్‌ బి లాంటి చోట ప్ర‌చారం చేస్తున్నారు. ప్లాన్ బాగానే ఉంది. కొండ‌ల్లో కోయ‌దొర‌లా క‌నిపిస్తున్నా ఆ లుక్ షారూక్‌ కి యాప్ట్. ఇంకా చెప్పాలంటే  జానీ డెప్‌ కి ఇండియ‌న్ వెర్ష‌న్ షారూక్ డెప్‌ లా ఉన్నాడు. బావుంద‌య్యో ఈ గెట‌ప్‌. ఇలా కూడా ఓ క్యారెక్ట‌ర్ ట్రై చేయొచ్చుక‌దా! అని ఎంక‌రేజ్ చేయాల‌నిపిస్తోంది క‌దూ?
Tags:    

Similar News