రోహిత్ శర్మపై షారుఖ్ ఖాన్ ఫీలింగ్ ఇదా?

Update: 2023-01-25 09:37 GMT
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) ఫ్రాంచైజీ కోల్ కతా నైట్ రైడర్స్ (KKR) సహ-యజమాని అయిన కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ తన త‌దుప‌రి చిత్రం `పఠాన్` ప్రమోషన్ లో బిజీగా ఉన్నాడు. జనవరి 24న ఖాన్ తన సోష‌ల్ మీడియా అభిమానులతో Q&A సెషన్ ను నిర్వహించాడు. ఈ వేదిక‌పై ఒక అభిమాని భారత కెప్టెన్ రోహిత్ శర్మను సింగిల్‌ లైన్ లో వ‌ర్ణించ‌మ‌ని అడిగాడు.

క్రికెట్ కి వీరాభిమాని అయిన ఖాన్ చాలా మంది భారతీయ క్రికెటర్లతో చ‌క్క‌ని స‌త్సంబంధాలను క‌లిగి ఉన్నారు. రోహిత్ కి అత‌డు స‌న్నిహితుడు. అభిమానుల అభ్యర్థనకు వెంట‌నే SRK ప్ర‌తిస్పందించారు. ``రోహిత్ మంచి హృద‌యం గ‌ల‌వాడు.. తెలివైనవాడు... అతనితో కొన్ని స్వీటెస్ట్ అనుభూతులు ఉన్నాయి`` అని ప్ర‌శంసించారు.

శర్మ ప్రస్తుతం న్యూజిలాండ్ తో జరిగే వైట్-బాల్ సిరీస్ లో మెన్ ఇన్ బ్లూ(టీమిండియా)కు నాయకత్వం వహిస్తున్నాడు. తొలి రెండు మ్యాచ్ ల గెలుపులో శ‌ర్మ పాత్ర ఉంది. ఓపెనర్లు రోహిత్‌ శర్మ -శుభ్ మాన్ గిల్ భారత్ ను  20 ఓవర్లలో 165 పరుగుల మార్కుతో ప‌రుగులు పెట్టించ‌డం ఈ జైత్ర‌యాత్ర‌ను సులువు చేసింది.

2022లో ఆట‌గాడిగా ఫెయిలైన  శ‌ర్మ తర్వాత వైట్-బాల్ క్రికెట్ లో అత్యంత ఫలవంతమైన స్కోరర్ లలో ఒకడిగా నిలిచారు. ఒక‌ట‌వ ODIలో శ్రీలంకపై 83 పరుగులు చేసి 2023ని శుభారాంభం చేశాడు. 2వ ODIలో న్యూజిలాండ్ పై విజ‌యం అందించి.. ఇండోర్ లో జరిగిన మూడవ వ‌న్డేలో తన ఫామ్ ను కొనసాగించ‌డంతో అంద‌రి దృష్టిని ఆక‌ర్షించాడు. క్రికెట‌ర్ రోహిత్ తో ఫిల్మ్ స్టార్ కింగ్ ఖాన్ అనుబంధం చాలా గొప్ప‌ది. అందుకే `ప‌ఠాన్`  రిలీజ్ సంద‌ర్భంలో అభిమాని రోహిత్ గురించి ప్ర‌శ్నించ‌కుండా ఆగ‌లేక‌పోయాడు.

యష్ రాజ్ ఫిల్మ్స్ నిర్మించిన `పఠాన్` కోసం అడ్వాన్స్ బుకింగ్ లు జనవరి 20న ప్రారంభమయ్యాయి. ఈ చిత్రాన్ని భారతదేశం అంతటా 5000 స్క్రీన్ లలో విడుదల చేయబోతున్నట్లు సమాచారం. ఉదయం 6 గంటలకు షోలు వేసిన తొలి షారుఖ్ సినిమా ఇదే. 2018లో వచ్చిన జీరోలో చివరిసారిగా కనిపించిన SRK బ్రేక్ త‌ర్వాత సంచ‌ల‌నాల‌కు రెడీ అవుతున్నాడు. పఠాన్ రూ. 45 - 50 కోట్ల మేర‌ ఓపెనింగ్ సాధిస్తుంద‌ని అంచ‌నా.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.

Similar News