ట్విట్ట‌ర్‌ లో బాద్‌ షా రిప్ల‌య్‌ కి షాకైంది

Update: 2015-11-05 05:17 GMT
చిన్మ‌యి శ్రీపాద.. సౌత్ - నార్త్‌ లో పాపుల‌ర్ గాయ‌ని అన్న సంగ‌తి తెలిసిందే. ఏమాయ చేశావే నుండి స‌మంత‌ - త్రిష - లావ‌ణ్య త్రిపాఠి - రాధిక ఆప్టే - కంగ‌న‌ - స‌మీరారెడ్డి - కార్తీక‌ - తాప్సీ - కాజ‌ల్‌ - ఎమీజాక్స‌న్‌ - అమ‌లాపాల్‌ - న‌య‌న‌తార‌ - సోనాక్షి - హ‌న్సిక‌ - పూజా హెగ్డే .. ఇంత‌మంది క‌థానాయిక‌లకు తెలుగు - త‌మిళ్‌ లో డ‌బ్బింగ్ అందించిన ఘ‌న‌త చిన్మ‌యి సొంతం. టాలీవుడ్‌ - కోలీవుడ్‌ లో భారీ చిత్రాల‌కు గాయ‌నిగా కొన‌సాగింది. ఇంత పాపులారిటీ ఉన్న ఈ అమ్మ‌డు అందాల రాక్ష‌సి ఫేం హీరో రాహూల్‌ ని పెళ్లాడిన సంగ‌తి తెలిసిందే.

అయితే చిన్మ‌యి రాహుల్ కంటే బాలీవుడ్ బాద్‌ షా షారూక్‌ ఖాన్‌ కి పెద్ద ఫ్యాన్‌. అందుకే నిన్న‌టిరోజున షారూక్ 50వ‌ పుట్టిన‌రోజు జ‌రుపుకుంటున్న వేళ  ట్విట్ట‌ర్‌ లో అత‌డికి శుభాకాంక్ష‌లు తెలిపింది. అంతేకాదు అట్నుంచి అదిరిపోయే రిప్ల‌య్ కూడా అందుకుంది.  హ్యాపీ బ‌ర్త్ డే స‌ర్‌. మీ నుంచి ఎంద‌రో ఇన్‌ స్ప‌యిర్ అయ్యారు. అందులో నేను కూడా ఉన్నాను. మెనీ - మెనీ మోర్ హ్యాపీ - హ్యాపీయ‌ర్‌ - హ్యాపీయెస్ట్ బ‌ర్త్ డేస్ .. అంటూ ట్వీటింది చిన్మ‌యి. దానికి రిప్ల‌య్ గా షారూక్ ఇచ్చిన ట్వీట్ త‌న‌ని నిజంగా ఖుషీ చేసేసింది. థాంక్యూ సో మ‌చ్ అండ్ ల‌వ్ టు మామ్.. అంటూ బాద్‌ షా రిప్ల‌య్ ఇచ్చారు.

నేను సంవ‌త్స‌రం అంతా చేయ‌లేనిది. షారూక్ ఓ ట్వీట్‌ తో చేసేశాడే అంటూ రాహూల్ స‌ర్‌ ప్రైజ్ అయ్యాడు. ఆ ఒక్క‌ ట్వీట్ ఏడాదిపాటు త‌న‌ని ఆనందంగా ఉంచుతుంద‌ని అన్నాడు. త‌న‌ని గుర్తు పెట్టుకుని ట్వీట్ చేసినందుకు చిన్మ‌యి ఉబ్బిత‌బ్బిబ్బ‌య్యింది. అదీ మ్యాట‌రు.
Tags:    

Similar News