బ‌స్సులో ఇంత హ‌డావుడి ఎందుకంటే?

Update: 2017-07-07 16:37 GMT
హీరో ఎంత మొన‌గాడైనా.. అదంతా రీల్ వ‌ర‌కే. టాప్ స్టార్లు సైతం.. త‌మ సినిమా ప్ర‌చారానికి చిత్ర‌.. విచిత్రంగా వ్య‌వ‌హ‌రించ‌క త‌ప్ప‌నిస‌రి. మామూలుగా ఉంటే మీడియాలోనూ.. సోష‌ల్ మీడియాలోనూ క‌నిపించే ప‌రిస్థితి ఉండ‌దు. అదే.. రోటీన్‌కు భిన్నంగా వ్య‌వ‌హ‌రిస్తే.. షేర్లు.. కామెంట్లు.. లైకులు.. తిట్లు.. ఇలా ఏదో ఒకర‌కంగా వైర‌ల్ అవుతూ ఉంటుంది. దాంతో వ‌చ్చే ప్రచారంతో సినిమాకు కావాల్సినంత ప్ర‌చారం ఫ్రీగా ల‌భించే ప‌రిస్థితి.

అందుకే.. సినిమా చేసిన త‌ర్వాత‌.. ఆ సినిమా ప్ర‌చారం చేయ‌టం కోసం గ‌తం కంటే భిన్నంగా ప్ర‌చారం చేయ‌టం రోజురోజుకూ ముమ్మ‌రం చేస్తున్నారు. బాలీవుడ్ టాప్ హీరోల్లో ఒక‌రైన కింగ్ ఖాన్ షారూక్ సంగ‌తే చూడండి. తాజాగా ఆయ‌న న‌టించిన జ‌బ్ హ్యారీ మెట్ సెజ‌ల్ చిత్రం త్వ‌ర‌లో విడుద‌ల కానుంది. దీనికి సంబంధించిన చిత్ర ప్ర‌చారాన్ని ఇప్ప‌టికే ముమ్మ‌రం చేశారు.

అనుష్క‌శ‌ర్మ జోడీగా న‌టించిన ఈ సినిమా వ‌చ్చే నెల నాలుగున థియేట‌ర్ల‌కు రానుంది. ఇప్ప‌టికే ప్ర‌చారం మొద‌లెట్టినా.. ఈసినిమాకు రావాల్సిన హైప్ ఇంకా రాలేదు. ఈ విష‌యాన్ని గుర్తించారో ఏమో కానీ..తాజాగా షారుక్ బ‌స్సులో.. స్పైడ‌ర్ మ్యాన్ లా ఒక ఫీట్ వేసి అల‌రించారు. ఆ వీడియోను సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేశారు. షారుక్ లాంటోడు స్పైడ‌ర్ మ్యాన్ లా ఫీట్ చేస్తే జ‌నాల‌కు ఎంత ఆస‌క్తి. ఇప్పుడీ బుజ్జి వీడియో తెగ వైర‌ల్ అయిపోతోంది. ప్ర‌చారం కోసం.. స్పైడ‌ర్ మ్యాన్ ఏంది? ఆడి అమ్మ మొగుడిలా అయినా ఫోజులిచ్చేస్తారు మ‌రి? వ‌్యాపార‌మా.. మ‌జాకానా?

Full View
Tags:    

Similar News