అందరిని షాక్ కు గురి చేస్తూ.. తన దారిన తాను వెళ్లిపోయింది అతిలోక సుందరి శ్రీదేవి. 54 ఏళ్ల చిన్నప్రాయంలో ఆమె వెళ్లిపోయిన తీరు దేశ ప్రజల్ని శోకతప్తులుగా చేసింది. జామురాతిరి జాబిలమ్మ అంటూ అమాయకంగా పాట పాడిన శ్రీదేవి స్వరం ఇంకా మదిని వీడని వేళ.. అదే జామురాతిరి వేళ.. అందరిని విషాదంలో ముంచేస్తూ తానొచ్చిన లోకాలకే తిరిగి వెళ్లిపోయింది.
శ్రీదేవి మరణవార్తను ప్రధాన మీడియా సంస్థలు ఈ తెల్లవారుజాము మూడు గంటల వేళలో బ్రేక్ చేశాయి. దుబాయ్ లో ఆమె మరణం శనివారం రాత్రి పదిన్నర గంటల వేళ చోటు చేసుకున్నప్పటికీ..ఆమె మరణవార్త కన్ఫర్మేషన్ భారతకాలమానం ప్రకారం ఆదివారం తెల్లవారుజామున రెండున్నర గంటల వేళలో బ్రేక్ అయ్యింది.
ఈ సందర్భంగా జాతీయ మీడియా మొదలు స్థానిక మీడియా వరకూ శ్రీదేవి మరణవార్తను నాన్ స్టాప్ గా ఇస్తున్నాయి. ఈ సందర్భంగా ఆమె నటించిన చివరి చిత్రంగా మామ్ ను పేర్కొంటున్నారు. ఏడాది క్రితం విడుదలైన మామ్ చిత్రం పాజిటివ్ టాక్ ను సాధించింది. విమర్శకుల ప్రశంసలు పొందింది. అయితే.. బాక్సాఫీస్ దగ్గర మాత్రం ఆర్థికంగా అంచనా వేసినంత భారీగా సక్సెస్ కాలేదు. మామ్ తర్వాత శ్రీదేవి జీరో మూవీలో స్పెషల్ అప్పీరెన్స్ కు ఓకే చెప్పారు.
షారూక్ మరగుజ్జుగా నటిస్తున్న ఈ మూవీలో.. అనుష్క శర్మ.. కత్రినా కైఫ్ లు నటిస్తున్నారు. ఈ చిత్రంలో ప్రత్యేక పాత్ర కోసం శ్రీదేవి ఓకే చెప్పారు. షెడ్యూల్ ప్రకారం ఈ మూవీ డిసెంబరు 21న విడుదల కావాల్సి ఉంది. అయితే.. శ్రీదేవి షూటింగ్ పార్ట్ పూర్తి కాలేదు. తన పెద్ద కుమార్తె జాహ్నవి నటిస్తున్న తొలి చిత్రం ధడక్ పనుల్లో బిజీగా ఉండటంతో జీరో మూవీలో తన పాత్రను కంప్లీట్ చేయలేదని చెబుతారు. కుమార్తె మూవీ రిలీజ్ తర్వాత జీరో చిత్రంలో శ్రీదేవి నటించాల్సి ఉంది. అంతలోనే.. అనుకోని రీతిలో తిరిగిరాని లోకాలకు ఆమె వెళ్లిపోయారు.