సీరియస్ గా కామెడీ చేస్తున్న శంకర్

Update: 2019-06-14 06:21 GMT
కమెడియన్స్ హీరోలు కావడం టాలీవుడ్ లో కొత్తేమి కాదు. అలనాటి రాజబాబు నుంచి ఇవాళ వచ్చిన సప్తగిరి దాకా అందరూ అదృష్టాన్ని పరీక్షించుకున్న వాళ్లే. ఒకటో రెండో హిట్లు కొట్టినవాళ్ళే. అయితే సోలో హీరోగా వీళ్లకు స్పాన్ తక్కువ ఉంటుంది. కొంత కాలం అయ్యాక బ్యాక్ టు పెవిలియన్ అనాల్సిందే. అలీ సునీల్ ఇలా చెప్పుకోదగ్గ ఉదాహరణలు చాలానే ఉన్నాయి. ఏది చేసినా అంతర్లీనంగా కామెడీ ఉంటేనే హాస్య నటుల సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తారు.

కానీ క్యాలికులేషన్స్ ఇంకోలా వేసుకుని రూటు మారిస్తే మాత్రం ఫలితం తేడా కొట్టేస్తుంది. కానీ షకలక శంకర్ మాత్రం ఈ సూత్రాన్ని వంటబట్టించుకున్నట్టు లేడు. ఆ మధ్య శంభో శంకర అంటూ సీరియస్ మాస్ మసాలా చేసి దెబ్బ తిన్న ఇతను ఇప్పుడు మరో ప్రయత్నం చేస్తున్నాడు.  నాలుగో సింహం పేరుతో రూపొందుతున్న సినిమాలో షకలక శంకర్ సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ గా చేస్తుండటం విశేషం. ఇది ఎంతవరకు జనానికి కనెక్ట్ అవుతుందన్నది విడుదలయ్యాక కానీ చెప్పలేం.

పైగా సప్తగిరి లాగా శంకర్ ఈ మధ్య రెగ్యులర్ గా సినిమాల్లో కనిపించడం లేదు. హీరో అయ్యాను కదా ఇక అవసరం లేదనుకున్నాడో లేక ఆఫర్స్ ఆగిపోయాయో తెలియదు కానీ ఇలా నాలుగో సింహం ఐదో పులివి లాంటివి కాకుండా కామెడీ జానర్ లోనే హీరోగా ట్రై చేస్తే మంచి రిజల్ట్స్ దక్కే అవకాశం లేకపోలేదు. కానీ షకలక శంకర్ మాత్రం పట్టువదలని విక్రమార్కుడిగా ఈ ప్రయత్నాలు మానేలా లేడు. షూటింగ్ దాదాపు పూర్తి చేసుకున్న నాలుగో సింహానికి జానీ దర్శకుడు


Tags:    

Similar News