ప్లీజ్‌ మగాళ్లందరు చూడండి అంటూ షకీలా ఎమోషనల్‌ వ్యాఖ్యలు

Update: 2020-07-16 08:10 GMT
1970.. 1980 కిడ్స్‌ కు షకీలా గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దాదాపు రెండు దశాబ్దాల పాటు సౌత్‌ ఇండియాలో శృంగార సామ్రాజ్య సినిమాలకు పెట్టింది పేరుగా నిలిచిన షకీలా అప్పట్లో స్టార్‌ హీరోలకు కూడా సవాల్‌ విసిరే స్థాయిలో సినిమాలు చేసింది. ఒకానొక సమయంలో షకీలా సినిమా విడుదల అవుతున్న నేపథ్యంలో స్టార్‌ హీరోల సినిమాలు వాయిదా వేసుకునే వారు. అంతటి క్రేజ్‌ దక్కించుకున్న షకీలా ప్రస్తుతం తీవ్రమైన ఆర్థిక సమస్యలతో సతమతం అవుతోందట.

సినిమాలతో ఆమె సంపాదించిన మొత్తం పోగొట్టుకుందట. అయిన వారు మోసం చేయడంతో ఆర్థికంగా చితికి పోయాను అంది. రెండు సంవత్సరాల క్రితం ఈమె ‘లేడీస్‌ నాట్‌ అలౌడ్‌’ అనే చిత్రాన్ని చేసింది. మూడు నెలల్లో షూటింగ్‌ పూర్తి చేసి రెండు నెలల్లో పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌ పూర్తి చేసిన షకీలా సినిమాను విడుదల చేయడంలో మాత్రం విఫలం అయ్యింది. సినిమాకు సెన్సార్‌ రాకపోవడంతో అప్పటి నుండి కూడా విడుదల చేయలేక పోయింది. తాజాగా ఈ చిత్రాన్ని డిజిటల్‌ ఫార్మట్‌లో సొంత వెబ్‌ సైట్‌ ద్వారా విడుదల చేయాలని నిర్ణయించుకుంది. 50 రూపాయల టికెట్లు పెట్టింది.

లేడీస్‌ నాట్‌ అలౌడ్‌ అనే వెబ్‌ సైట్‌ ను ఓపెన్‌ చేసి 50 రూపాయలు చెల్లించి సినిమాను చూడవచ్చు. ఈ విషయాన్ని షకీలా తెలియజేసింది. సినిమా ప్రమోషన్‌ లో భాగంగా షకీలా మాట్లాడుతూ.. ఈ సినిమా కోసం నా ఆస్తులు అమ్మాను. అప్పులు తెచ్చి సినిమాను పూర్తి చేశాను. సినిమా విడుదల కోసం హైదరాబాద్‌.. దిల్లీ.. ముంబయి.. చెన్నై ఇలా చాలా చోట్ల సెన్సార్‌ కోసం తిరిగాను. కాని ఎక్కడ కూడా సెన్సార్‌ సమస్యకు పరిష్కారం దక్కలేదు. ఇలాంటి సమయంలో కరోనా కారణంగా సినిమాను విడుదల చేయలేక పోతున్నాను. అప్పులు కట్టాలంటూ ఒత్తిడి పెరుగుతుంది.

ఇలాంటి సమయంలో డిజిటల్‌ లో సినిమాను విడుదల చేసుకునే అవకాశం ఉందని తెలుసుకుని నేరుగా మీ ముందుకు తీసుకు వస్తున్నాను. మగాళ్లంతా కూడా ఈ సినిమాను చూడండి. మగాళ్లు ఈ సినిమా చూస్తేనే నేను ఆర్థకంగా కాస్త అయినా తేరుకుంటాను. మళ్లీ సినిమాలు చేస్తానో లేదో చెప్పలేను. ఈ సారి మీరు సినిమా చూస్తే బయట పడతానంటూ షకీలా ఎమోషనల్‌ అయ్యింది. లేడీస్‌ నాట్‌ అలౌడ్‌ అనే వెబ్‌ సైట్‌ కు వెళ్తే ఆ సినిమాను చూడవచ్చు.
Tags:    

Similar News