ఆవిడ ఈవిడేనా? ముఖ మార్పిడి శస్త్రచికిత్సతో షాకిచ్చిన న‌టి!!

Update: 2022-11-17 00:30 GMT
షామా సికిందర్ ప‌రిచ‌యం అవ‌స‌రం లేదు. హోస్ట్ కం న‌టిగా టాప్ మోడ‌ల్ గా సుప‌రిచితం. ఈ 41 ఏళ్ల బోల్డ్ సిజ్లింగ్ బ్యూటీ నిరంత‌రం తన సోషల్ మీడియా ఫోటోషూట్ల‌తో యువ‌త‌రంలో హాట్ టాపిక్ గా మారుతోంది. షామా 2003 సంవత్సరంలో `యే మేరీ లైఫ్ హై` అనే సీరియల్ తో ఆరంగేట్రం చేసింది. బాల్ వీర్ వంటి షోలలో నటించిన తర్వాత వెబ్ సిరీస్ లు  షార్ట్ ఫిల్మ్ లకు మారి సెక్సాహోలిక్ - మాయ వంటి షోలలో నటించింది. ఇవ‌న్నీ బోల్డ్ కంటెంట్ తో విరుచుకుప‌డే షోలుగా పాపుల‌ర‌య్యాయి.

తాజాగా ఈ బ్యూటీ సోషల్ మీడియాలో 10 సంవత్సరాల (#టెన్ ఇయ‌ర్స్ బ్యాక్) ఛాలెంజ్‌ ను స్వీకరించి అప్పటి ఫోటోతో నేటి ఫోటోని జ‌త చేసి షేర్ చేసిన తర్వాత అక‌స్మాత్తుగా మ‌రోసారి చర్చనీయాంశంగా మారింది. షామా షేర్ చేసిన ఆ రెండు ఫోటోల‌ను త‌ర‌చి చూసిన అభిమానులు త‌ను కత్తి కిందకు వెళ్లిందని .. ముఖానికి ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుందని కామెంట్ల‌తో విరుచుకుప‌డ్డారు.

నిజానికి షామా సికందర్ మునుప‌టి ఫోటోల‌లో రూపానికి ఇటీవ‌లి రూపానికి అస‌లు ఏమాత్రం సంబంధం లేదు. ఆ రెండు ముఖాకృతులు పూర్తి భిన్నంగా ఉన్నాయ‌ని అభిమానులు భావిస్తున్నారు.

అయితే షామా దీనికి త‌న‌దైన శైలిలో జ‌వాబిచ్చే ప్ర‌య‌త్నం చేసింది.
శారీరకంగానే కాకుండా మార్పు (పరివర్తన) అనేది ఎక్కువగా మానసికంగా జ‌రిగే ప్ర‌క్రియ అని షామా తెలిపింది. ``మొదట్లో ఇలాంటి కామెంట్లు ఆరోపణలు నాకు అర్థం కాలేదు. నేను తప్పు చేశానని నేరస్థురాలిని అని అంతా భావించినా నేను అవేవీ చేయ‌లేదు క‌దా?  నేను వారు ఊహించిన‌ట్టు అలా చేశానో లేదో కూడా ఎవ‌రికీ క‌చ్చితంగా తెలియదు. దీని గురించి వివరించడానికి లేదా మాట్లాడటానికి నాకు ఎలాంటి కారణం కనిపించడం లేదు. ఇది నా జీవితం. నాకు ఏది కావాలంటే అది చేయగలను. రెండవది.. నేను ఏం అనుభవించానో మీకు తెలియదు!`` అంటూ గుంభ‌న‌గా జ‌వాబిచ్చింది.

ప్లాస్టిక్ సర్జరీ కాదు బొటాక్స్ ట్రీట్‌మెంట్ ..

త‌న రూపంలోని పరివర్తన పై ప్రజల వాదోప‌వాదనల గురించి మాట్లాడుతూ స‌ర్జ‌రీ వ్య‌వ‌హారంపైనా షామా ఓపెనైంది. ``నా విషయంలో ఎటువంటి ప్లాస్టిక్ సర్జరీ అవ‌స‌రం ప‌డ‌లేదు. నేను అనుస‌రించిన‌ది కేవలం సౌందర్య ప్రక్రియ అయినప్పుడు నేను ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నాను అని ప్రజలు ఎందుకు అంటారో నాకు తెలియదు. ప్రజలు నన్ను వ‌య‌సు ప‌రిక్ర‌మంలో ఎదుగుతున్న‌ అమ్మాయిగా చూశారు. కాబట్టి కొన్ని శారీరక మార్పులు జ‌రిగాయి. ఇంకా జరుగుతూనే ఉన్నాయి. అయితే ఇక నుంచి నేను పూర్తిగా మారితే మీరే చెప్పండి. నాక్కూడా అర్థ‌మ‌వుతుంది. అయినా నేను సరిగ్గా పని చేస్తాను. సరిగ్గా తింటాను.. ధ్యానం చేస్తాను.. కాబట్టి నా శ‌రీరంలో రూపంలో మార్పు క‌నిపిస్తుంది. నేను ఇండస్ట్రీ నుంచి బయటకు వెళ్లి డిప్రెషన్ లో ఉన్నప్పుడు చాలా ఏళ్లుగా జనాలు నన్ను చూడలేదు. నేను బొటాక్స్ ట్రీట్ మెంట్ తీసుకున్నాను కానీ అది దిద్దుబాటు శస్త్రచికిత్స విభాగంలోకి రాదు. నేను స‌ర్జ‌రీల పేరుతో కత్తి కిందకు వెళ్ళలేదు. అదే సమయంలో ఎవరైనా నటుడు లేదా నటి ప్లాస్టిక్ సర్జరీకి వెళితే ప్రజలు దాని గురించి ప‌దే ప‌దే త‌ల‌చుకుని అస్సలు ఇబ్బంది పడకూడదు`` అని క్లాస్ తీస్కుంది.

రోజు చివరిలో కష్టపడి సంపాదించిన డబ్బు గురించి ఆలోచిస్తూ ప్రజలంతా కొన్ని అభిప్రాయాలను కలిగి ఉంటారు.. కానీ నాపై ట్రోలింగ్ ఎందుకో నాకు అర్థం కాలేదు. ట్రోలింగ్స్ ఇప్పుడు నన్ను చాలా అరుదుగా ప్రభావితం చేస్తాయి. నేను క్రమం తప్పకుండా చేసే ధ్యానానికి ధన్యవాదాలు. ఇది నాకు ప్రశాంతంగా ఉండటానికి సహాయపడుతుంది.. అని షామా సుదీర్ఘ నోట్ లో వెల్ల‌డించింది.

ట్రోల‌ర్ల‌ను ఒక ర‌కంగా షామా తీసి పారేసింది. ఒక‌వేళ ఎవ‌రైనా న‌టీమ‌ణులు స‌ర్జ‌రీలు చేయించుకున్నా అది వారి వ్య‌క్తిగ‌తం. అందులో వేలు పెట్టొద్ద‌ని రాద్ధాంతం చేయొద్ద‌ని.. అస‌లు దీంతో ప్ర‌జ‌ల‌కు సంబంధం లేద‌ని త‌న వాద‌న‌ను బ‌లంగా వినిపించింది.  కాబ‌ట్టి ఇక‌పై న‌టీమ‌ణులు శ‌స్త్ర చికిత్స‌ల గురించి ప‌దే ప‌దే మాట్లాడుకోవ‌డం వ్య‌ర్థం.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News