రోబో2 కోసం శంకర్ కష్టాలు..

Update: 2015-09-26 17:30 GMT
సూపర్ స్టార్ రజినీకాంత్ హీరో, ఉద్దండ దర్శకుడు శంకర్ కాంబినేషన్ లో వస్తున్న మూవీకి కష్టాలేంటి అనుకుంటున్నారా ? రోబో2 మూవీని శంకర్ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాడు. సౌత్ సినిమాలకు ఎంతటి స్కోప్ ఉందో ప్రూవ్ చేసిన వాళ్లలో మణిరత్నం తర్వాత, శంకర్ పేరునే చెప్పుకోవాలి. ఇప్పుడు ఇంత టెక్నాలజీ - పబ్లిసిటీ అందుబాటులోకి వచ్చాక బాహుబలితో రాజమౌళి రికార్డులు కొట్టాడు కానీ.. కేవలం కంటెంట్ ని మాత్రమే నమ్ముకుని.. దేశం మొత్తం అబ్బురపడేలా మూవీస్ తీశాడు శంకర్.

ఇప్పుడు రోబో2 కోసం బాగానే కష్టపడుతున్నాడు. ఇఫ్పుడు శంకర్ టార్గెట్ రోబోని మించిన హిట్ కొట్టడం కాదు.. బాహుబలి సాధించిన రికార్డులను బ్రేక్ చేయడం. అందుకే బడ్జెట్ ని కూడా భారీగానే పెంచేశాడు. మొదటి మూవీకి రెట్టింపు బడ్జెట్ అంటే.. అక్షరాలా 280 కోట్ల రూపాయలతో రోబో2 రెడీ చేయాలన్నది శంకర్ టార్గెట్. కానీ మొదటి పార్ట్ కి నిర్మాణం  వహించిన కళానిధి మారన్.. ఇప్పుడు ఆర్థిక కష్టాల్లో ఇరుక్కున్నాడు. దీంతో కొత్త నిర్మాతలను వెతుక్కోక తప్పలేదు శంకర్ కి.

అందుకే.. విదేశీ నిర్మాతలతో సంప్రదింపులు జరుపుతున్నాడు. శంకర్ చేస్తానంటే.. బడా నిర్మాణ సంస్థలు క్యూ కడతాయి కానీ.. కండిషన్స్ అప్లై అంటాయి. ఎందుకంటే.. ముందు ఐ - తెలుగులో మనోహరుడు ఇచ్చిన షాక్ అలాంటిది మరి. అందుకే తనకు మారన్ మాదిరిగా స్వేచ్ఛనిస్తూ డబ్బులు పెట్టే నిర్మాతలను రంగంలోకి దించడం ఇఫ్పుడు శంకర్ టార్గెట్. ఇప్పటికే ఓ ఫారిన్ ప్రొడ్యూసర్ పెట్టుబడి పెట్టేందుకు సై అన్నట్లు టాక్‌.
Tags:    

Similar News