ప్రభాస్ హీరోగా సుజిత్ డైరెక్షన్లో తెరకెక్కుతున్న యాక్షన్ థ్రిల్లర్ 'సాహో'. ఈమధ్యే ఫిలిం మేకర్స్ ఈ సినిమా రిలీజ్ డేట్ కన్ఫాం చేశారు. అయితే రిలీజ్ డేట్ పోస్టర్లో మ్యూజిక్ డైరెక్టర్ల త్రయం శంకర్ - ఎహసాన్ - లాయ్ పేర్లు లేకపోవడం ఒక హాట్ టాపిక్ అయింది. మరో యాక్షన్ పోస్టర్ పోస్టర్ రిలీజ్ చేస్తే అందులో కూడా వారి పేర్లు లేవు. ఇది జరిగిన తర్వాత శంకర్ - ఎహసాన్ - లాయ్ తాము సినిమా నుండి తప్పుకున్నామని.. సాహో టీమ్ కు అల్ ది బెస్ట్ అని ట్విట్టర్ ద్వరా ధృవీకరించారు. అయితే సాహో టీమ్ కు శంకర్ - ఎహసాన్ - లాయ్ కు మధ్య ఏం జరిగిందో మాత్రం తెలియలేదు.
తాజాగా శంకర్ ఈ విషయంపై క్లారిటీ ఇచ్చాడు. బాలీవుడ్ మీడియాతో మాట్లాడుతూ "మ్యూజిక్ కంపెనీ సాహో ఆల్బమ్ లో వేరే మ్యూజిక్ డైరెక్టర్ల పాటలు ఉండాలని కోరింది. కానీ మేము పని చేసే సినిమాకు ఇతర సంగీత దర్శకులు పని చేయడం మాకు నచ్చదు. మేము ఏ సినిమాకు పని చేసినా సోలో కంపోజర్ గా ఉంటాము." అని క్లారిటీ ఇచ్చాడు. తాము ముగ్గురు అయినా ఒక సెట్ లాగా పని చేస్తామని తెలిపాడు. బాలీవుడ్ లో ఒక సినిమాకు చాలామంది సంగీత దర్శకులు పని చేయడం కామన్ అయిందని దాన్ని తామేమీ వ్యతిరేకించడం లేదని.. అయితే తమకు మాత్రం అది కంఫర్టబుల్ కాదని అన్నాడు.
ఒక కంపోజర్ పని చేసినప్పుడు సినిమాకు ఒక ఐడెంటిటీ ఉంటుందని.. సినిమా అంతా ఒక ఫీల్ క్యారీ అవుతుందని చెప్పాడు. తాము గతంలో పని చేసిన 'భాగ్ మిల్ఖా భాగ్'.. 'తారే జమీన్ పర్'.. 'కల్ హో న హో' సినిమాలన్నిటికీ ఇలాగే పని చేశామని తెలిపాడు.