మ్యూజిక్ లవర్స్ కు పెద్ద షాక్ తగిలింది. ప్రతిభావంతుడైన గాయకుడిగా ప్రఖ్యాతి చెందిన శంకర్ మహదేవన్ గుండెపోటుతో ఆస్పత్రిలో జాయిన్ అయ్యారు. డిసెంబర్ 4, శుక్రవారం ఉదయాన్నే ఆయనకు రెండుసార్లు తీవ్రస్థాయిలో ఛాతీ నొప్పి రావడంతో.. వెంటనే ఢిల్లీలోని హాస్పిటల్ కు తరలించారు.
శంకర్ మహదేవన్ సన్నిహితులు చెబుతున్న వివరాల ప్రకారం.. మరికొన్ని రోజులు ఆయన ఆస్పత్రిలోనే ఉండాల్సి ఉంటుంది. మరోవైపు ఈ గాయకుడు గుండె నొప్పితో హాస్పిటల్ లో చేరిన విషయాన్ని డాక్టర్లు ధృవీకరించారు. ప్రస్తుతం ఐసీయూలో ఉన్నారని, అయితే పరిస్థితి ఇప్పుడు సాధారణ స్థాయిలోనే ఉందని, భయపడాల్సింది ఏమీ లేదని వివరించారు డాక్టర్లు. కాని అసలు మ్యాటర్ ఏంటంటే.. శంకర్ మహదేవన్ అధిక శారీరక శ్రమ కారణంగా అలసిపోయి ఓవర్ ఎక్సర్షన్ తో బాధపడ్డారే కాని.. గుండెల్లో నొప్పి కాదట. కాకపోతే డౌట్ రావడంతో ఆయనకు యాంజియోగ్రామ్ చేశారట.
ఇదే విషయమై ఒక లీడింగ్ మీడియా శంకర్ మహదేవన్ కు మెసేజ్ పంపిస్తే... "ఆల్ ఈజ్ వెల్, నేనిప్పుడు బాగానే ఉన్నా, అందరికీ కృతజ్ఞతలు" అంటూ స్పందించారాయన. ఈ నెల చివర్లో హైద్రాబాద్ లో కూడా శంకర్ మహదేవన్ లైవ్ షో షెడ్యూల్ లో ఉంది.