వచ్చేశాం.. ‘2.0’ రిలీజ్ నెలలోకి. ఇంకో నాలుగు వారాల్లోపే ఈ విజువల్ వండర్ ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తోంది. ఈ చిత్రం భారతీయ ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని ఇవ్వబోతోందని ఈ రోజు రిలీజైన ట్రైలర్ చూస్తే అర్థమైంది. ఎనిమిదేళ్ల కిందట.. ఇంకా ఇండియన్ సినిమాలో టెక్నాలజీ విప్లవం మొదలవకముందే అద్భుత మాయాజాలంతో సంభ్రమాశ్చర్యాలకు గురి చేశాడు శంకర్. ఇప్పుడికి ఎంతో అప్ గ్రేడ్ అయిన టెక్నాలజీని వాడుకుని ఎలాంటి అద్భుతాలు సృష్టించి ఉంటాడో చెప్పేదేముంది? ఈ చిత్రం అంచనాలకు ఏమాత్రం తగ్గని రీతిలో ఉంటుందని ట్రైలర్ స్పష్టం చేసింది. ఇప్పటికే ఇండియాలో ఎన్నో త్రీడీ సినిమాలు వచ్చినప్పటికీ.. ‘2.0’ వాటికంటే భిన్నమైన అనుభూతిని కలిగిస్తుందన్నది స్పష్టం. ముందు 2డీలో తీసి.. తర్వాత త్రీడీకి కన్వర్ట్ చేయడం కాకుండా త్రీడీ కెమెరాలతోనే చిత్రీకరణ జరిపాడు శంకర్.
హాలీవుడ్ స్థాయి టెక్నాలజీ వాడటం వల్ల త్రీడీ ఎఫెక్ట్స్ తిరుగులేని స్థాయిలో ఉంటాయంటున్నారు. పైగా విజువల్ ఎఫెక్ట్స్ కూడా ప్రపంచ స్థాయికి ఏమాత్రం తగ్గేలా లేవు. ఈ రకంగా విజువల్ గా ‘2.0’ కళ్లు చెదిరిపోయేలా చేయడం ఖాయం. మరోవైపు ‘2.9’ సౌండ్ ఎఫెక్ట్స్ కూడా వావ్ అనిపించేలా ఉంటాయట. 4 డీ ఎఫెక్ట్స్ తో థియేటర్లు దద్దరిల్లిపోయేలా ఆస్కార్ విన్నింగ్ సౌండ్ డిజైనర్ రసూల్ పొకుట్టి సౌండ్ డిజైన్ చేశాడట. దీని గురించి దర్శకుడు శంకర్ చెబుతూ.. థియేటర్లోని ప్రతి ప్రేక్షకుడూ తన సీటు కింద స్పీకర్ ఉన్న భావన కలిగించేలా ‘2.0’లో సౌండ్ ఎఫెక్ట్స్ ఉంటాయని శంకర్ తెలిపాడు. విజువల్ ఎఫెక్ట్స్ విషయంలో ఈ సినిమాకు పడ్డ కష్టం మరే చిత్రానికీ పడలేదని.. అది చాలా ఛాలెంజింగ్ గా అనిపించిందని.. సినిమాలో వీఎఫెక్స్ చూసి ప్రేక్షకులు థ్రిల్లవుతారని శంకర్ అన్నాడు.