‘2.ఓ’ చిత్రం విడుదలకు మరికొన్ని గంటలే మిగిలి ఉంది. ఈ చిత్రం ఫలితం గురించి దర్శకుడు శంకర్ చాలా నమ్మకంగా ఉన్నాడు. ప్రేక్షకులు కూడా చిత్రం ఎలా ఉంటుందో అనే ఆలోన లేకుండా ఎన్ని రికార్డులు బద్దలు కాబోతున్నాయి, ఏ స్థాయిలో ఈ సినిమా వసూళ్లు ఉంటాయో అనుకుంటూ చర్చించుకుంటున్నారు. ఇంతటి భారీ సినిమాను తెరకెక్కించిన శంకర్ తన తదుపరి చిత్రం విషయంలో అస్సలు లేట్ చేయాలనుకోవడం లేదు. ఇప్పటికే ‘భారతీయుడు’ కు సీక్వెల్ గా ఇండియన్ 2 ను ప్రకటించిన విషయం తెల్సిందే.
‘భారతీయుడు’ చిత్రంలో నటించిన కమల్ హాసన్ సీక్వెల్ లో కూడా నటించబోతున్నాడు. ఇక ‘భారతీయుడు’ చిత్రంలో సేనాపతి పాత్రకు మంచి గుర్తింపు దక్కింది. ఇప్పుడు అదే పాత్రను ‘ఇండియన్ 2’ లో కూడా కొనసాగించబోతున్నాడు. అప్పట్లో కమల్ లుక్ కు అద్బుతమైన స్పందన వచ్చింది. అందుకే ఇప్పుడు కూడా అదే లుక్ తో కమల్ కనిపించబోతున్నట్లుగా శంకర్ అధికారికంగా క్లారిటీ ఇచ్చాడు.
అప్పట్లో కమల్ ఎలా అయితే ఉన్నాడో - ఎలాంటి ఎనర్జితో ఉన్నాడో ఇప్పుడు అలాగే అంత ఎనర్జితో ఆ పాత్రను చేయబోతున్నాడు. టెస్ట్ షూట్ జరిపి - మేకప్ టెస్టు చేసి కమల్ లుక్ ను ఫైనల్ చేశాం. ఆ లుక్ ను చూస్తుంటే రోజంతా కూడా చూస్తూనే ఉండాలనిపించింది అంటూ శంకర్ చెప్పుకొచ్చాడు. 2.ఓ చిత్రం సందడి పూర్తి అవ్వడమే ఆలస్యం ‘ఇండియన్ 2’ చిత్రం పట్టాలెక్కబోతుంది. ఇక విడుదలకు కూడా ఎక్కువ సమయం తీసుకోవద్దని శంకర్ భావిస్తున్నాడట. తమిళంతో పాటు తెలుగు, హిందీల్లో కూడా ఈ చిత్రం భారీ ఎత్తున విడుదల చేసే అవకాశం ఉంది.