భారతీయ సినీ చరిత్రలోనే అత్యధికంగా రూ.450 కోట్ల భారీ బడ్జెట్ తో ‘2.0’ సినిమాను రూపొందిస్తున్నాడు శంకర్. ఈ చిత్రం ఏప్రిల్లో ప్రేక్షకుల ముందుకొస్తుంది. దాని తర్వాత కూడా శంకర్ తన స్థాయికి తగ్గ భారీ సినిమానే తెరకెక్కించబోతున్నాడు. లోక నాయకుడు కమల్ హాసన్ కథానాయకుడిగా ‘భారతీయుడు’ సీక్వెల్ చేయడానికి ఆయన రంగం సిద్ధం చేసుకుంటున్నాడు. ఇంకొన్ని నెలల్లోనే ఈ చిత్ర రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుంది. ఓవైపు ‘2.0’ పోస్ట్ ప్రొడక్షన్ పనులు కానిస్తూనే.. మరోవైపు ‘భారతీయుడు’ ప్రి ప్రొడక్షన్ పనులు మొదలుపెట్టేశాడు శంకర్. ఇటీవల గణతంత్ర దినోత్సవం సందర్భంగా తైవాన్ లో ‘ఇండియన్-2’ పేరుతో ఉన్న ఎయిర్ బెలూన్ ను శంకర్ లాంచ్ చేసిన సంగతి తెలిసిందే.
ప్రస్తుతం శంకర్ తో పాటు ఈ చిత్ర కెమెరామన్.. కొందరు టెక్నీషియన్లు తైవాన్ లోనే ఉన్నారు. వాళ్లు చైనాలోని పలు ప్రాంతాల్లో రెక్కీ నిర్వహిస్తున్నారట. ‘భారతీయుడు’ సినిమాలో తన కొడుకును చంపేశాక హీరో కనిపించకుండా పోతాడు. తర్వాత హాంకాంగ్ నుంచి ఫోన్ చేస్తాడు. దేశం మళ్లీ దారి తప్పినపుడు భారతీయుడు మళ్లీ వస్తాడనే సంకేతం ఇస్తాడు. అలా ముగిసిన కథను.. అక్కడి నుంచే మొదలుపెట్టనున్నాడట శంకర్. మళ్లీ దేశంలో అవినీతి హద్దులు దాటుతోందని తెలిసి.. చైనాలో ఉన్న భారతీయుడు తిరిగి ఇండియాకు తిరిగి రావడంతో ఈ కథ ఆరంభమవుతుందట. ఐతే ‘భారతీయుడు’ సినిమాలో కథానాయకుడిని 80 ఏళ్ల వాడిగా చూపిస్తారు. ఇప్పటికి వయసు వందేళ్లు దాటిపోతుంది. మరి ఇక్కడ లాజిక్ సంగతేంటి అన్నది చూడాలి. ఈ విషయంలో శంకర్ ఎలా కన్విన్స్ చేస్తాడో మరి.