రజినీకాంత్- శంకర్ ల కాంబినేషన్ లో రూపొందుతున్న రోబో సీక్వెల్ 2.0. మొన్నీ మధ్యే 50శాతం షూటింగ్ పూర్తయిందంటూ.. దర్శకుడు శంకర్ ఓ అప్ డేట్ కూడా పెట్టాడు. మరో 3 నెలల్లో మిగిలిన షూటింగ్ పార్ట్ కూడా పూర్తయిపోతుందని తెలుస్తోంది. శరవేగంగా టాకీ పార్ట్ తో పాటు పాటలను పూర్తి చేసేసి గ్రాఫిక్ వర్క్ లోకి దిగాలన్నది శంకర్ ఐడియా.
అంతా బాగానే ఉంది కానీ ఇప్పుడీ సినిమా రిలీజ్ ని వచ్చే ఏడాది సమ్మర్ నుంచి దీపావళికి పోస్ట్ పోన్ చేశారని తెలుస్తోంది. పోస్ట్ ప్రొడక్షన్ పనుల కోసమే ఇలా వాయిదా వేయాల్సి వస్తోందని చెప్పుకుంటున్నారు. 7 ఫారిన్ విజువల్ ఎఫెక్ట్స్ కంపెనీలు.. ఇప్పటికి 7 నెలలుగా గ్రాఫిక్స్ పని చేస్తున్నాయి. వారికింగా దాదాపు 10నెలల సమయం ఉంది. అంటే సమ్మర్ కి విడుదల చేయడం సాధ్యమే. కానీ రోబో2.0ను వాయిదా వేసేందుకు అసలు కారణం వేరే ఉంది. 2.0జీరోపై 200కోట్లకు పైగా కుమ్మరిస్తున్న లైకా ప్రొడక్షన్స్ సమ్మర్ రేస్ నుంచి తప్పించాలని శంకర్ పై ఒత్తిడి తెచ్చారట. ఇందుకు కారణం.. వచ్చే ఏడాది ఏప్రిల్ 14న దర్శకధీరుడు తీసిన బాహుబలి2 విడుదల కానుండడమే.
బాహుబలి తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా.. తమిళనాట కూడా ఊహించని స్థాయిలో ఘనవిజయం సాధించింది. స్ట్రయిట్ చిత్రాలకు మించి వసూళ్లను రాబట్టింది. అందుకే బాహుబలి2పై కూడా మంచి అంచనాలు ఉన్నాయి. డిస్ట్రిబ్యూటర్ల పెట్టుబడులు కూడా బాగానే ఉంటాయి. బాహుబలి2కి పోటీగా వెళితే.. కంటెంట్ పోటీగా ఉంటే ఓకే.. లేని పక్షంలో తేడా వచ్చేస్తుంది. అసలు పోటీ పడే బదులుగా.. దీపావళి సీజన్ కి షెడ్యూల్ చేసుకుంటే.. సేఫ్ జోన్ లో ఉండచ్చన్నది నిర్మాత, దర్శకులతో పాటు.. హీరో ఐడియా కూడా అని టాక్.