‘రోబో’ లాంటి సినిమా ఇండియన్ స్క్రీన్ మీద వస్తుందని అప్పటిదాకా ఎవరూ అనుకోలేదు. హాలీవుడ్ ప్రమాణాలకు ఏమాత్రం తగ్గని రీతిలో ఓ విజువల్ వండర్ ను భారతీయ ప్రేక్షకులకు అందించాడు శంకర్. ఇప్పుడు దాన్ని మించి పోయే రీతిలో ‘2.0’ను తీయడానికి తపిస్తున్నాడు శంకర్. ఇది ‘రోబో’కు ఏమాత్రం తగ్గని రీతిలో ఉంటుందని అంతా అనుకుంటున్నారు. అందులోనూ శంకర్ మాటల్ని బట్టి చూస్తుంటే.. ఈ సినిమా కోసం అతను మామూలు కష్టం పడట్లేదదని అర్థమవుతోంది. ‘‘రోబో సినిమా తీయడం అంటే ఎవరెస్టు ఎక్కడం లాంటిది. ‘2.0’ తీయడం ఎవరెస్టును మోయడం లాంటిది’’ అని శంకర్ అన్నాడు. దీన్ని బట్టే శంకర్ ఈ ప్రాజెక్టు కోసం ఎంత శ్రమిస్తున్నాడో అర్థం చేసుకోవచ్చు.
ఇక ఈ సినిమా గురించి రజినీకాంత్ చెబుతూ.. ‘‘2.0లో నటించడాన్ని ఎంతగానో ఆస్వాదించా. ఇది యునీక్ సబ్జెక్ట్. ఇది శంకర్ కు.. ఈ చిత్ర నిర్మాతలకు.. మాకు మాత్రమే ప్రతిష్టాత్మకమైన సినిమా కాదు. ఇండియన్ సినిమాకే ఇది ప్రెస్టీజియస్ మూవీ. సాంకేతికంగా.. ఆర్థికంగా మనం ఎంతగా ముందంజ వేసినా.. ఇప్పటికీ హాలీవుడ్ ప్రమాణాల్ని అందుకోలేదు. 2.0 కచ్చితంగా హాలీవుడ్ స్థాయి సినిమా అవుతుంది. దీన్ని చూసి భారతీయ సినీ పరిశ్రమే గర్విస్తుంది. శంకర్ తో పని చేయడం అంత సులువు కాదు. ఎందుకంటే అతనో పర్ఫెక్షనిస్ట్. ఇక ఈ సినిమాలో హీరో నేను కాదు. అక్షయ్ కుమార్. అతడికి హ్యాట్సాఫ్’’ అని రజినీ చెప్పాడు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/