మొత్తానికి ‘శంకరాభరణం’ టీమ్ ప్లాన్ బాగానే వర్కవుటైంది. ఓ పెద్ద సినిమా స్థాయిలో దీన్ని అగ్రెసివ్ గా ప్రమోట్ చేయడమే కాక.. పెద్ద ఎత్తున రిలీజ్ చేయడం ఓపెనింగ్స్ కు బాగానే హెల్పయింది. చిన్న సినిమాల్లో తొలి రోజు కెరీర్ బెస్ట్ ఓపెనింగ్స్ తెచ్చుకున్న సినిమా అయింది ‘శంకరాభరణం’. తొలి రోజు ఈ చిత్రానికి రెండు తెలుగు రాష్ట్రాల్లో రూ.1.5 కోట్ల షేర్ వచ్చింది. కర్ణాటక - ఓవర్సీస్ వసూళ్లన్నీ కలిపితే శుక్రవారం ఈ సినిమాకు రూ.2 కోట్ల కంటే ఎక్కువే షేర్ వచ్చినట్లు. గ్రాస్ వసూళ్లు రూ.3.5 కోట్ల దాకా ఉండొచ్చు. నిఖిల్ లాంటి చిన్న హీరోకు ఇది పెద్ద మొత్తమే అని చెప్పాలి.
ఐతే ఓపెనింగ్స్ సంగతి ఓకే కానీ.. తొలి రోజు డివైడ్ టాక్ తో మొదలైన నేపథ్యంలో తర్వాతి రోజుల్లో సినిమా ఎలాంటి వసూళ్లు సాధిస్తుందో చూడాలి. ముఖ్యంగా సోమవారం నుంచి కలెక్షన్స్ ఎలా ఉన్నాయన్నదాన్ని బట్టి సినిమా రిజల్ట్ ఆధారపడి ఉంటుంది. పెట్టుబడి తక్కువే కానీ.. సినిమాను కొంచెం ఎక్కువ రేట్లకే అమ్మారు. రూ.12 కోట్ల దాకా బిజినెస్ జరిగింది‘శంకరాభరణం’ మూవీకి. మరి ఆ మొత్తం రికవర్ కావడమంటే కొంచెం కష్టమే. పైగా వచ్చే గురువారమే ‘బెంగాల్ టైగర్’ థియేటర్లలోకి దిగుతోంది. ఆ మరుసటి రోజు కిల్లింగ్ వీరప్పన్ - లచ్చిందేవికి ఓ లెక్కుంది’ రిలీజవుతాయి. మరి‘శంకరాభరణం’ పరిస్థితి ఏమవుతుందో చూడాలి.