దేశవ్యాప్తంగా కరోనా కేసులు రోజురోజుకి విపరీతంగా పెరుగుతున్న విషయం తెలిసిందే. కేసులు పెరగడంతో పాటు మరణాల సంఖ్య కూడా అధికమవుతోంది. ఇప్పుడు సినీ ఇండస్ట్రీలో కూడా పలువురు ప్రముఖులు కరోనా బారిన పడటంతో కలవరపడుతున్నారు. ఇప్పటికే బిగ్ బీ అమితాబ్ - అభిషేక్ బచ్చన్ - ఐశ్వర్యారాయ్ కరోనా సోకడంతో ముంబైలోని ప్రైవేట్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలో సినీ ప్రముఖులు చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ తన ఇంటిని ప్లాస్టిక్ కవర్స్ తో కప్పేశారంటూ ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అంతేకాకుండా చుట్టూ ప్లాస్టిక్ కవర్లతో ప్యాక్ చేయబడి ఉన్న షారుక్ బంగ్లాకి సంబందించిన ఓ ఫోటో కూడా నెట్టింట వైరల్ అవుతోంది. ముంబైలో కరోనా మహమ్మారి వీరవిహారం చేస్తుండటం మరియు ఈ వైరస్ గాలి ద్వారా కూడా వ్యాప్తి చెందే అవకాశాలు ఉన్నాయని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఇలాంటి ముందు జాగ్రత్తలు తీసుకున్నారేమోనని అందరూ అనుకున్నారు.
అయితే షారుఖ్ బంగ్లాకు ఉన్న ప్లాస్టిక్ ముసుగు కరోనా వ్యాప్తి నివారణ కోసం తీసుకున్న నిర్ణయం మాత్రం కాదని తెలుస్తోంది. వర్షాకాలం కారణంగా ముంబైలో కురిసే వర్షాల నుంచి రక్షించుకునేందుకు షారుఖ్ తన ఇంటిని ప్లాస్టిక్ కవర్స్ తో కప్పేసాడట. షారుక్ ఇలా తన ఇంటికి ప్లాస్టిక్ తొడగడం ఇదేమీ మొదటిసారి కాదని.. ప్రతి ఏడాది తన ఇంటిని ఇలా వర్షాకాలంలో కప్పివేస్తుంటారని బీ టౌన్ జనాలు చెప్తున్నారు. మరి షారుక్ తన ఇంటికి ప్లాస్టిక్ ముసుగు ఎందుకు తొడిగాడో తెలియదు కానీ బాద్ షా ముందు జాగ్రత్తని మాత్రం మెచ్చుకోవలసిందే. ప్రస్తుతం షారుక్ ఖాన్ తన భార్యాపిల్లతో కలిసి ఆ ఇంటిలోనే నివాసం ఉంటున్నారు. కరోనా తీవ్రత ఎక్కువ అవుతుండటంతో బయటకి రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.