బాలీవుడ్ సూపర్ స్టార్ షారూక్ ఖాన్ భార్య ప్రొడ్యూసర్ గానూ చాలా ఫేమస్. అయితే.. గ్లామర్ ఎండ్ లోనూ ఈమెకు చాలా క్రేజ్ ఉంది. ఫ్యాషన్ ఎలిమెంట్స్ ను పక్కాగా ఫాలో అవడం, క్రియేటివ్ మైండ్ సెట్ తో డిజైనింగ్ వంటి విషయాల్లోనూ గౌరీ ఖాన్ కు అనుభవం చాలా ఉంది.
సొంత హోమ్ డిజైనింగ్, డెకరేషన్ బ్రాండ్ కు బ్రాండ్ అంబాసిడర్ గా బాద్షా భార్య తనే వ్యవహరిస్తోంది. ఈ బ్రాండ్ కోసం దుబాయ్ లో స్పెషల్ ఫోటోషూట్ నిర్వహించారు. పారిస్ లో జరగనున్న ఓ ఈవెంట్ లో ఈ కలెక్షన్ తోపాటు, ప్రమోషన్ ను కూడా ఎగ్జిబిట్ చేయనన్నారు. ఈ కార్యక్రమానికి గౌరీఖాన్ కూడా అటెండ్ కానుంది. “ఇంత భారీ ఈవెంట్ లో భాగం అయ్యే గౌరవం దక్కడంతో హ్యాపీగా ఉంది. డిజైన్, క్రాఫ్ట్ విషయంలో ఇండియాకి మరింత వన్నె తెచ్చేలా ఈ బ్రాండ్ కృషి చేయనుంది. ఇందులో నా పార్ట్నర్ షిప్ ఉండడం సంతోషకరమైన విషయం” అంది గౌరీఖాన్
భర్త షారుక్, పిల్లలతో కలిసి దుబాయ్ లో న్యూ ఇయర్ వేడుకలు జరుపుకున్నారీమె. ఆ తర్వాత ఈ బ్రాండ్ ప్రమోషన్ కోసం ఫోటో షూట్ కూడా చేశారు. తమకు దుబాయ్ సెకండ్ హోమ్ అంత దగ్గర అంటోందీమె. ముంబయితోపాటు, ఢిల్లీలోనూ స్టోర్లు తమ బ్రాండ్ స్టోర్లను ప్రారంభించగా.. దుబాయ్ లో కూడా త్వరలో ఓపెన్ చేయనున్నారు. ఈమెకు త్వరలో హీరో అయ్యేంత కొడుకు ఆర్యన్ ఉన్నాడనే విషయం.. ఈ ఫోటోలు చూస్తే నమ్మడం కష్టం కదూ.