భారీ క్రేజ్ వున్న సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఆ క్రేజ్ కి తగ్గట్టుగా పరిస్థితుల కారణంగా ఆకట్టుకోలేకపోయిన సందర్భాలు చాలానే వున్నాయి. దాని వల్ల భారీ రేట్లకు ఆయా సినిమాలని సొంతం చేసుకున్న డిస్ట్రిబ్యూటర్లు, ప్రొడ్యూసర్ నష్టాలని చివి చూడటం తెలిసిందే. అయితే చాలా మంది హీరోలు బయ్యర్లకు, నిర్మాతలకు తిరిగి నష్టాలని చెల్లించడానికి ఇష్టపడరు. కానీ కొంత మంది హీరోలు మాత్రం ఆ నష్టాన్ని దృష్టిలో పెట్టుకుని నిర్మాతకు మరో సినిమా చేసుకోమని అవకాశం ఇస్తుంటారు.
గతంలో 'బాబా' సినిమాకు భారీ నష్టాలు రావడంతో ఆ భారం మొత్తం డిస్ట్రిబ్యూటర్లపై పడింది. ఈ విషయాన్ని గమనించిన హీరో సూపర్ స్టార్ రజనీకాంత్ తన పారితోషికం నుంచి నష్టాల్లో వున్న డిస్ట్రిబ్యూటర్లకు కొంత మొత్తాన్ని ఇచ్చి కొత్త సంప్రదాయానికి తెరలేపారు. అప్పటి నుంచి నష్టాల భారిన పడిన నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్ల కోసం హీరోలు మరో సినిమా చేయడం చూస్తూనే వున్నాం. అయితే ఓ హీరో ఏకంగా తనతో సినిమా చేసి రాంగ్ టైమ్ రిలీజ్. బడ్జెట్ పెరిగిన కారణంగా నష్టపోయిన నిర్మాతకు రెండవ సినిమాని ఎలాంటి పారితోషికం తీసుకోకుండా చేయడం ఇప్పడు ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది.
ఆ హీరో మరెవరో కాదు యంగ్ హీరో శర్వానంద్. ఈ హీరోతో యువ నిర్మాత చెరుకూరి సుధాకర్ 'పడి పడి లేచే మనసు' చిత్రాన్ని నిర్మించారు. సోలో ప్రొడ్యూసర్ గా ఇదే ఆయన తొలి చిత్రం. శర్వానంద్, సాయి పల్లవి జంటగా నటించిన ఈ చిత్రం విభిన్నమైన మ్యూజికల్ లవ్ స్టోరీగా రూపొందింది. నేపాల్ నేపథ్యంలో సరికొత్త ప్రేమకథగా రూపొందిన ఈ మూవీకి బడ్జెట్ పెరిగిపోవడం ప్రధాన సమస్యగా మారింది. అలాగే రాంగ్ టైమ్ రిలీజ్ కూడా ఈ చిత్రానికి ప్రధాన సమస్యగా మారడంతో సినిమా ఆశించిన స్థాయిలో వసూళ్లని రాబట్టలేకపోయింది.
దీంతో నిర్మాత నష్టాలని చవిచూడాల్సి వచ్చింది. నిర్మాతగా ఫస్ట్ ఫిల్మ్ 'పడి పడి లేచే మనసు' బడ్జెట్ ఫెయిల్యూర్ గా మిగిలింది. ఈ విషయాన్ని గ్రహించిన హీరో శర్వానంద్ ఇదే నిర్మాతకు మరో చిత్రాన్ని చేసుకునే అవకాశం ఇచ్చారు. అయితే 'పడి పడి లేచే మనసు' బడ్జెట్ ఫెయిల్యూర్ కావడంతో తదుపరి చిత్రానికి శర్వానంద్ ఎలాంటి పారితోషికాన్ని ఆశించకుండా సినిమా చేశారు. అదే 'ఆడవాళ్లు మీకు జోహార్లు'. కిషోర్ తిరుమల డైరెక్ట్ చేసిన ఈ చిత్రం ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చింది.
చక్కని ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా మహిళా ప్రేక్షకుల్ని ఆకట్టుకునే కథా, కథనాలతో రూపొందిన ఈ చిత్రంలోని శర్వానంద్ పాత్రకు మంచి మార్కులు పడ్డాయి. ప్రస్తుతం మంచి టాక్ తో ప్రదర్శింపబడుతోంది. అయితే ఈ సినిమా రాంగ్ టైమ్ లో విడుదల కావడం ప్రధాన సమస్యగా మారింది. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ 'భీమ్లానాయక్' కు ప్రభాస్ 'రాధేశ్యామ్'కు మధ్య విడుదల కావడం ఈ చిత్రానికి పెద్ద డ్రాబ్యాక్ గా మారింది. శర్వానంద్ నిర్మాత శ్రేయస్సు కోరి చేసిన సినిమా రాంగ్ టైమ్ లో విడుదల కావడం కొంత ఇబ్బందికరంగా మారింది.
అయితే నిర్మాత మాత్రం ఈ మూవీని అనుకున్న బడ్జెట్ లోనే పూర్తిచేసి రిలీజ్ టైమ్ కి టేబుల్ ప్రాఫిట్ ని సొంతం చేసుకుని సేఫ్ జోన్ లో వున్నారట. ఈ సంఘటనని బట్టే శర్వా ప్రొడ్యూసర్స్ హీరో అని, తనని నమ్మిన ప్రొడ్యూసర్స్ కోసం ఆలోచిస్తుంటారని స్పష్టమవుతోందని చెప్పుకుంటున్నారు.