వెర్సటైల్ స్టార్ శర్వానంద్ వరుస సినిమాలతో వేగం పెంచిన సంగతి తెలిసిందే. `పడి పడి లేచే మనసు` తర్వాత వరుసగా రెండు సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నాడు. శర్వా 27.. శర్వా 28 ప్రస్తుతం ఆన్ సెట్స్ ఉన్నాయి. శర్వానంద్ 27 టాకీ పూర్తయింది. ఈ సినిమాకి టైటిల్ ని అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. ప్రస్తుతం నిర్మాణానంతర పనులు సాగుతున్నాయి. మే 31న సినిమాని రిలీజ్ చేయనున్నారు. ఈ చిత్రంలో శర్వానంద్ సరసన అందాల చందమామ కాజల్ నటించారు. సుధీర్ వర్మ దర్శకత్వం వహిస్తున్నారు. సితార ఎంటర్ టైన్ మెంట్స్ అధినేత సూర్య దేవర నాగవంశీ నిర్మిస్తున్నారు.
శర్వా 28 (96 రీమేక్) గురించి తాజాగా ఓ అప్ డేట్ తెలిసింది. శర్వానంద్ - సమంత జంటగా సి.ప్రేమ్ కుమార్ దర్శకత్వంలో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ అధినేత దిల్ రాజు ఈ రీమేక్ ను నిర్మిస్తున్నారు. శర్వా ఇందులో వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ గా నటిస్తున్నారు. ఇటీవలే మారిషస్ లో ఒకరోజు పాటు చిత్రీకరణ పూర్తి చేశారు. తదుపరి 15 రోజుల పాటు కెన్యా అడవుల్లో షెడ్యూల్ ఉంటుంది. ఈ సోమవారం నుంచి చిత్రీకరణ సాగనుందని తెలుస్తోంది. ఇప్పటికే శర్వా 28 టీమ్ కెన్యాకు బయల్దేరే ప్లాన్ లో ఉందిట. ఇక ఈ సినిమాకి ఇంకా టైటిల్ ని నిర్ణయించలేదు. కేవలం 32 రోజుల్లోనే చిత్రీకరణ పూర్తి చేస్తారని తెలుస్తోంది.
మారిషస్ షెడ్యూల్ కాస్త రిస్కీనే అని తెలుస్తోంది. ఈ షెడ్యూల్ ను వాటర్ స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో చిత్రీకరించారు. ఇందుకోసం శర్వానంద్ స్కూబా డైవింగ్ నేర్చుకున్నారు. తనకు ఇది కొత్తనే కాబట్టి కాస్త రిస్కీనే అని టీమ్ చెబుతోంది. ఒకరోజంతా శర్వా స్కూబా డైవింగ్ లో ట్రైనింగ్ తీసుకున్నారని తెలుస్తోంది. ఇకపోతే శర్వానంద్ నటిస్తున్న రెండు చిత్రాలు కథల పరంగా పూర్తి విభిన్నమైనవి కావడం ఆసక్తికరం.