శర్వానంద్ యంగ్ హీరోల్లో కాస్త డిఫరెంట్ క్యారెక్టర్. ఏ సినిమాలు పడితే ఆ సినిమాలు ఒప్పుకోడు. రొటీన్ సినిమాకు భిన్నంగా ఉన్న కథల వైపే మొగ్గుచూపుతాడు. ఇప్పుడు తన వయసుతో ప్రయోగాలు చేసే సినిమాకు ఓకే చెప్పాడు. 20 ఏళ్ల వయసులో ఉన్న శర్వాగా, 40 ఏళ్ల వయసులో ఉన్న మెచ్యూర్డ్ వ్యక్తిగా కనిపించబోతున్నాడు.
హను రాఘవపూడి దర్శకత్వంలో ప్రస్తుతం శర్వానంద్ ఓ సినిమా చేయడానికి సిద్ధపడ్డాడు. అది ఆర్మీ బ్యాక్ డ్రాప్ లో సాగే సినిమా. ఇందులో శర్వానంద్ 20 ఏళ్ల వయసు యువకుడిగా, అలాగే 40 ఏళ్ల వ్యక్తిగా కనిపించబోతున్నాడు. ఇందుకోసం బాగానే బ్యాక్ గ్రౌండ్ వర్క్ చేస్తున్నాడు. యువకుడిగా కనిపించేందుకు పది కిలోల బరువు కూడా తగ్గుతున్నాడట. పోనీ టెయిల్ హెయిర్ స్టైల్ తో యూత్ లుక్ లో అదరగొట్టేందుకు సిద్దమవుతున్నాడట. ఇక 40 ఏళ్ల వ్యక్తిలా కనిపించేందుకు మళ్లీ బరువు పెరుగుతున్నాడట. అంతేకాదు ఆర్మీ ఆఫీసర్లా కనిపించబోతున్నాడట. మన తెలుగులో ఆర్మీ బ్యాక్ డ్రాప్ లో వచ్చే సినిమాలు తక్కువే కాబట్టి... ఈ సినిమాపై అంచనాలు ఏర్పడే అవకాశం ఎక్కువే.
ఈ సినిమాలో సాయి పల్లవి శర్వానంద్ తో తొలిసారి నటించనుంది. ఈ సినిమా షూటింగ్ కోల్ కతా ఈ నెల నుంచే ప్రారంభం కానుంది. ఆ తరువాత షూటింగ్ స్పాట్ నేపాల్‌కు మారనుంది. నేపాల్ లోఆర్మీకి సంబంధించిన సీన్లను చిత్రీకరించనున్నారు. శర్వానంద్ ఎంచుకున్న కథలు డిఫరెంట్‌గా ఉంటాయి కనుక... ఈ సినిమా నుంచి మనం ఎక్కువే ఎంటర్‌టైన్‌మెంట్‌నే ఆశించవచ్చు.