మొదటి నుంచి కూడా శర్వానంద్ విభిన్నమైన కథలను చేస్తూ వస్తున్నాడు. ఎంతో బరువైన పాత్రలను కూడా చాలా తేలికగా చేసేయడం ఆయన ప్రత్యేకత. ఆయన కెరియర్ ను పరిశీలిస్తే ఈ విషయం మనకి స్పష్టంగా అర్థమైపోతుంది. అలాంటి ఆయన తాజా చిత్రంగా 'మహా సముద్రం' రూపొందింది. నిన్న రాత్రి జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఈ సినిమాను గురించి శర్వానంద్ మాట్లాడాడు.
'గమ్యం' సినిమా సమయంలో రావు రమేశ్ గారితో నాకు పరిచయం జరిగింది. ఇటీవల ఒక సినిమా షూటింగు సమయంలో కలిసి నప్పుడు అజయ్ భూపతి దగ్గరున్న కథను గురించి ఆయన చెప్పారు. అద్భుతమైన కథ అని చెప్పడంతో, ఆ మరుసటి రోజే ఆయనను పిలిపించి కథ విన్నాను. ఫస్టాఫ్ వినగానే ఓకే చెప్పేశా. ఆ తరువాత అజయ్ భూపతి ఈ కథను అనిల్ సుంకర గారికి చెప్పడం జరిగింది. సింగిల్ సిట్టింగ్ లో ఆయన కూడా ఓకే చేశారు. మూడే మూడు రోజుల్లో ఓకే అయిన సినిమా 'మహా సముద్రం'. సాధారణంగా అలా ఏ సినిమాకి జరగదు. అలా జరగడానికి కారణం అజయ్ భూపతిగారికి ఆ కథ .. పాత్రలపై ఉన్న స్పష్ఠత.
ఇంతమంచి కథను .. పాత్రను నాకు ఇచ్చిన అజయ్ భూపతి గారికి, అనిల్ సుంకర గారికి నేను థ్యాంక్స్ చెబుతున్నాను. ఈ మధ్య కాలంలో నేను ఇంత కంఫర్టుగా ఎవరితో ఏ సినిమా చేయలేదు. ఇది ప్రధానంగా 'మహా' పాత్ర చుట్టూ తిరిగే కథ. ఇలాంటి పాత్రను చేయడం చాలా కష్టం. బరువైన భావోద్వేగాలతో కూడిన పాత్ర. మణిరత్నం శిష్యురాలు కనుక, అదితి కళ్లతోనే మాట్లాడ గలిగింది.
అనూ కూడా తన పాత్రను గొప్పగా చేసింది. సెకండఫ్ లో తన ఒక్క ఎక్స్ ప్రెషన్ చాలు ఈ సినిమాకి. ఫ్లాట్ అయిపోయాను.
జగపతిబాబు గారి విషయానికి వస్తే .. ఆయన ఈ ఫంక్షన్ కి రావలసి ఉంది. కానీ వేరే షూటింగులో ఉండిపోయారు. ఈ సినిమాలో ఆయన 'చుంచుమామ'గా చేశారు. ఆయన 'అంతఃపురం' చూసినప్పుడు అలా యాక్ట్ చేయాలిరా అనుకునేవాడిని. అలాంటి ఆయనతో కలిసి నటిస్తుంటే ఇది కలా? .. నిజమా? అనిపించింది. రాజ్ తోట కెమెరా పనితనం గొప్పగా ఉంది. ఆయన అన్ని సినిమాలు ఒప్పుకోరు .. తన టేస్టుకు తగిన సినిమాలు మాత్రమే సెలక్టివ్ గా చేస్తుంటారు. ఇది చైతన్ భరద్వాజ్ నుంచి వచ్చిన వండర్ఫుల్ ఆల్బం అని చెప్పుకోవచ్చు.
నిజం చెప్పాలంటే కరోనా కాలంలో చాలా కష్టపడి చేసిన సినిమా ఇది. ప్రతి ఒక్కరూ చాలా కష్టపడి పనిచేశారు. ఇక ఈ సినిమాతో ఏం సాంధించావని ఎవరైనా అడిగితే ఒక మంచి స్నేహితుడిని సంపాదించాను. ఒక మంచి స్నేహితుడిని పొందడం కన్నా సక్సెస్ ఏముంటుంది? నేను స్టార్ అని తను అంటున్నాడు కానీ, నా కంటే ముందు నుంచి అతను స్టార్. అలా మాట్లాడటం తన గొప్పతనం .. అంతే. చిరిగా చెప్పేదేంటంటే ఇంత డెప్త్ ఉన్న సినిమాను ఈ మధ్యకాలంలో మీరు చూసుండరు. ఇలాంటి క్యారెక్టరైజేషన్స్ రావు. పండగలకి వచ్చిన నా ప్రతి సినిమా హిట్ అయింది. ఎక్స్ ప్రెస్ రాజా .. శతమానం భవతి .. మహానుభావుడు .. ఇలా. ఈ సారి కూడా ఈ సినిమాతో హిట్ కొడుతున్నాను" అంటూ చెప్పుకొచ్చాడు.