టాలెంటెడ్ హీరో శర్వానంద్. సరైన సినిమా పడితే ఎక్కడికో వెళిపోతాడు అంటూ ఫిలిం ఇండస్ర్టీ జనాలు ఎప్పుడూ చెబుతూనే ఉంటారు. అయితే మనోడు మాత్రం ఆ సరైన సినిమా కోసం చాన్నాళ్ళ నుండి వెయిట్ చేస్తూనే ఉన్నాడు. ఇప్పుడు ఎక్స్ ప్రెస్ రాజా సినిమా తరువాత అందుకే జాగ్రత్తగా అడుగులు వేస్తున్నాడు.
నూతన దర్శకుడు చంద్రమోహన్ డైరక్షన్లో మనోడు ఇప్పుడు ఒక సినిమా చేస్తున్నాడు. అందాల రాక్షసి లావణ్య త్రిపాటి ఈ సినిమాలో చాలా గ్లామరసాన్ని వలకపోయడానికి సిద్దపడిందని మనకు ఆల్రెడి తెలుసుగా. ఈ సినిమాలోని మరొక ట్విస్టు ఏంటంటే.. మన శర్వానంద్ ఖాకీ డ్రస్ వేస్తున్నాడు. తొలిసారిగా పోలీస్ ఆఫీసర్ రోల్ లో మెరుస్తున్నాడు. గతంలో ఇదే డ్రస్సులో 'జంజీర్'లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ - 'డిపార్టమెంట్'లో రానా దగ్గుబాటి మెరిసారు. ఈ ఇద్దరూ శర్వానంద్ కు ప్రాణ స్నేహితులనే విషయం తెలిసిందే. ఇక వాళ్ళు ఖాకీలో దారుణంగా ఫ్లాపైన సంగతి తెలిసిందే. అందుకే ఇప్పుడు శర్వానంద్ చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి అంటున్నారు సెంటిమెంట్ రాయుళ్ళు.
ఏదేమైనా కూడా.. వరుసగా 10 కోట్ల నుండి 15 కోట్ల మధ్యన రెండు మూడు హిట్లు కొడితేనే కాని శర్వానంద్ మార్కెట్ ఒక రేంజుకు వచ్చే అవకాశం లేదు. సో.. ఈ పోలీసు జనాలను బాగా అలరించాలనే కోరుకుందాం.