విభిన్న కథలను ఎంపిక చేసుకుని నటిస్తాడనే మంచి పేరున్న శర్వానంద్ తాజాగా నటించిన చిత్రం ‘పడి పడి లేచె మనసు’. సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంకు హను రాఘవపూడి దర్శకత్వం వహించాడు. తాజాగా ఈ చిత్రం షూటింగ్ పూర్తి అయినట్లుగా చిత్ర యూనిట్ సభ్యుల ద్వారా సమాచారం అందుతోంది. ఈ సమయంలోనే ఈ సినిమాకు సంబంధించిన ఒక ఆసక్తికర విషయం ఫిల్మ్ సర్కిల్స్‌లో జోరుగా ప్రచారం సాగుతోంది. ఈ సినిమా నేపథ్యం గురించే ఆ ప్రచారం జరుగుతోంది.
2015వ సంవత్సరంలో నేపాల్ లో భూకంపం వచ్చిన విషయం తెల్సిందే. ఆ భూకంపంలో 9 వేల మందికి పైగా మృతి చెందినట్లుగా అధికారిక వర్గాలు వెళ్లడి చేశాయి. ఇక 22 వేల మందికి పైగా గాయాల పాలయ్యారు. నేపాల్ ను ఆదుకునేందుకు ప్రపంచ దేశాలన్నీ కూడా ముందుకు వచ్చాయి. ఇండియన్ ఆర్మీ రంగంలోకి దిగి మరీ నేపాల్ ను ఆదుకుంది. అయితే ఆ సమయంలో ఇండియన్ మీడియా ప్రవర్తించిన తీరు తీవ్ర విమర్శల పాలైంది. ప్రపంచ వ్యాప్తంగా ఇండియన్ మీడియాపై విమర్శలు వ్యక్తం అయ్యాయి. సహాయ కార్యక్రమాలకు అడ్డు పడుతూ మరీ ఇండియన్ మీడియా కవరేజ్ లు - లైవ్ లు ఇచ్చారనే విమర్శలు ఉన్నాయి. ఇలాంటి నేపాల్ భూకంపం నేపథ్యంలో పడి పడి లేచె మనసు సినిమా తెరకెక్కిందని పుకార్లు షికార్లు చేస్తున్నాయి.
మొదటి నుండి శర్వా - సాయి పల్లవిల మద్య ఒక మంచి ప్రేమ కథ ఉంటుందని చెబుతూ వచ్చిన చిత్ర యూనిట్ సభ్యులు ఇలా ఒక్కసారిగా షాక్ ఇచ్చారేంటి అంటున్నారు. ఈ చిత్రంలో సాయి పల్లవి డాక్టర్ గా కనిపించబోతుంది, శర్వానంద్ ఫుట్ బాల్ ప్లేయర్ గా కనిపించబోతున్నాడు. ఇప్పటికే విడుదలైన టీజర్ లో నేపాల్ భూకంపం గురించి ఎలాంటి విషయాలని చూపించలేదు. మరి ట్రైలర్ లో ఏమైనా దీని గురించి ఉంటుందేమో చూడాలి. డిసెంబర్ లో ఈ చిత్రం విడుదల కాబోతున్న విషయం తెల్సిందే.