కృష్ణ తత్వాన్ని ఇలా కూడా చెప్పొచ్చా?

Update: 2017-05-10 04:31 GMT
మరో రెండు రోజుల్లో 'రాధ' సినిమాతో వచ్చేస్తున్నాడు శర్వానంద్. ఆల్రెడీ శతమానం భవతి ఒక రేంజులో కిక్కిచ్చింది కాబట్టి.. ఈ సినిమా కూడా అదే రేంజులో సక్సెస్ అవుతుందనే నమ్మకంతో ఉన్నాడు. అయితే ఈ సినిమాలో కొత్త దర్శకుడు చంద్ర మోహన్ చూపించిన కమర్షియల్ యాంగిల్ మాత్రం ఇప్పటివరకు టీజర్లలో కనిపించింది కాని.. కనబడని కృష్ణ తత్వం కూడా ఉందట తెలుసా.

అవును ఈ సినిమాలో శ్రీకృష్ణుడు చెప్పిన తత్వాన్ని చెప్పారట. అదేంటంటే.. కృష్ణుడు దేవుడు అయ్యుండి కూడా.. పాచికలు ఆడకండ్రా పోతారు అని పాండవులకు చెప్పలేదు. అదేంటి కృష్ణా వీళ్ళు గేమ్ ఓడిపోతారు నానా కష్టాలు పడతారు అని నీకు ఫ్యూచర్ ముందే తెలిసినప్పుడు.. వీరికి చెప్పాలి కదా.. అని అడిగితే.. 'వాళ్లు గేమ్ ఆడేటప్పుడు ఏమి చేయమంటావ్ బావా అని నన్ను సలహా అడగలేదుగా. అడిగితే చెప్పుండేవాడ్ని' అని కృష్ణుడు చెప్పాడట. సరిగ్గా ఇదే పాయింట్ తీసుకున 'రాధ' సినిమా కథను కాటెంపరరీ సిట్యుయేషన్లో అల్లేశారని తెలుస్తోంది.

మొత్తానికి రాధ సినిమా కథను వింటుంటే.. కృష్ణ తత్వాన్ని ఇలా కూడా చెప్పొచ్చా అనిపించక మానదు. ఇక వెండితెర మీద ఈ కథ ఎలా ఉండోబోతోందో ఈ శుక్రవారం చూసేద్దాం. రాధ కోసం హీరోయిన్ లావణ్య త్రిపాఠి భారీ గ్లామరసాన్నే ఆరబోసిందిలే.
Tags:    

Similar News