రెండు కోట్లు పెంచేసిన ప్రామిసింగ్ హీరో!

Update: 2022-09-08 02:30 GMT
కెరీర్ ప్రారంభం నుంచి కొత్త త‌ర‌హా సినిమాల‌తో ఆక‌ట్టుకుంటూ వ‌స్తున్నారు ప్రామిసింగ్ హీరో శ‌ర్వానంద్‌. అయితే గ‌త కొంత కాలంగా ఈ హీరోకు ఆశించిన స్థాయి స‌క్సెస్ లు ప‌ల‌క‌రించ‌డం లేదు. అయినా స‌రే మార్కెట్‌, ప్రీ రిలీజ్ బిజినెస్ మాత్రం ఎక్క‌డా చెక్కు చెద‌ర‌డం లేదు. దీంతో శ‌ర్వాకు బ్యాక్ టు బ్యాక్ క్రేజీ ప్రాజెక్ట్ లు లైన్ క‌డుతున్నాయి. ఈ నేప‌థ్యంలో గ‌త కొంత కాలంగా ప్ర‌తి సినిమాకు రూ. 8 కోట్లు పారితోషికం తీసుకుంటున్న శ‌ర్వా తాజా మూవీకి మాత్రం రెండు కోట్లు పెంచేశాడ‌ట‌.

శ‌ర్వా లేటెస్ట్ మూవీ రెమ్యున‌రేష‌న్ రూ. 10 కోట్లు అని తెలిసింది. `ఆడ‌వాళ్లు మీకు జోహార్లు` త‌రువాత శ‌ర్వా న‌టించిన `ఒకే ఒక జీవితం` సెప్టెంబ‌ర్ 9న ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది. తమిళ‌, తెలుగు భాష‌ల్లో ఏక కాలంలో రూపొందించిన ఈ మూవీపై శ‌ర్వానంద్ భారీ అంచ‌నాలే పెట్టుకున్నాడు. టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్ తో ఈ మూవీని రూపొందించారు.

ఇదిలా వుంటే ఇటీవ‌ల కొంత బొద్దుగా మారిన శ‌ర్వా ఈ మూవీ కోసం భారీగా బ‌రువు త‌గ్గి స్లిమ్ లుక్ లోకి వ‌చ్చేశాడు. కొత్త సినిమా కోసం శ‌ర్వా కొత్త లుక్ లోకి మారిపోయాడు.

దాదాపు ఎనిమిది నెల‌ల విరామం త‌రువాత శ‌ర్వానంద్ సోమ‌వారం త‌న కొత్త ప్రాజెక్ట్ ని ప్రారంభించిన విష‌యం తెలిసిందే. కృష్ణ‌చైత‌న్య ఈ మూవీకి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ బ్యాన‌ర్ పై ఈ మూవీని టి. జి. విశ్వ‌ప్ర‌సాద్ నిర్మిస్తున్నారు.

పొలిటిక్ యాక్ష‌న్ డ్రామాగా రూపొందుతున్న ఈ మూవీ కోసం శ‌ర్వానంద్ రెమ్యున‌రేష‌న్ కింద రూ. 10 కోట్లు తీసుకుంటున్నార‌ట‌. ఇంత‌కు ముందు ప్ర‌తి సినిమాకు రూ. 8 కోట్లు తీసుకునే శ‌ర్వా మారిన మార్కెట్ ని దృష్ట్యా రూ. 10 కోట్లు తీసుకోవ‌డం గ‌మ‌నార్హం. ప్ర‌స్తుతం తెలుగు సినిమా నాన్ థియేట్రిక‌ల్ బిజినెస్ పెరిగింది. దాంతో రెమ్యున‌రేష‌న్ లు కూడా అందుకు త‌గ్గ‌ట్టుగానే పెరుగుతున్నాయి. ఆ కార‌ణంగానే శ‌ర్వా రెమ్యున‌రేష‌న్ కూడా పెరిగింద‌ని ఇన్ సైడ్ టాక్‌.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News