శతమానం భవతి ఫస్ట్ లుక్ పోస్టర్.. టీజర్ రెండూ కూడా చాలా ప్లెజెంట్ గా అనిపించాయి. మంచి ఫీల్ గుడ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ లాగా అనిపిస్తోంది ఈ సినిమా. కాకపోతే టీజర్ చూసిన చాలామందికి ఒక ఫీలింగ్ కలిగింది. ఇందులో ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ ఫ్లేవర్ కనిపించింది. ఆ విజువల్స్ అవీ దాదాపుగా అలాగే ఉన్నాయి. కాకపోతే ఇక్కడ అన్నదమ్ములు లేరు. ఒకే హీరో ఉన్నాడు. ప్రకాష్ రాజ్ ను చూస్తుంటే మాత్రం శ్రీకాంత్ అడ్డాల సినిమాల్లో ఎప్పుడూ కనిపించే లాగే కనిపించాడు. ముఖ్యంగా ఆయన్ని చూస్తేనే ఈ చిత్రం ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ను తలపించింది. పైగా జయసుధ ఆయనకు జోడీగా నటించడం.. పల్లెటూరి వాతావరణం.. విజువల్స్ చాలా వరకు ‘సీతమ్మ వాకిట..’ను గుర్తుకు తెచ్చాయి.
ఇంతకుముందు సతీశ్ వేగేశ్న దర్శకుడిగా రెండు సినిమాలు రూపొందించాడు. ఒకటి రామదండు.. ఇంకోటి దొంగలబండి. అవి రెండూ కామెడీ సినిమాలు. ఈసారి పూర్తి భిన్నంగా ప్రేమకథతో ముడిపడ్డ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ట్రై చేస్తున్నాడు. ఈ కథ మీద అతను దాదాపు రెండేళ్లుగా పని చేస్తున్నాడు. దిల్ రాజు ఈ ప్రాజెక్టు గురించి ఏడాదిగా చెబుతూ వస్తున్నాడు. అంటే స్క్రిప్టులో విశేషం ఉండకపోదు. పైగా శర్వానంద్ కొంత కాలంగా చాలా ఆచితూచి సినిమాలు ఎంచుకుంటున్నాడు. అందులోనూ సంక్రాంతికి పెద్ద సినిమాల మధ్య పోటీకి దిగుతున్నారంటే వాళ్ల కాన్ఫిడెన్స్ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. మరి వీళ్లంతా అంతగా నమ్మి చేస్తున్న సినిమా ఎలాంటి ఫలితాన్నిస్తుందో చూద్దాం.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/