రాజ్ కుంద్రాతో తాను విడాకులు తీసుకోవడానికి శిల్పాశెట్టినే కారణమని, తమ ఇద్దరినీ శిల్పానే విడగొట్టిందంటూ పలు ఇంటర్వ్యూల్లో కవిత చెప్పడం.. ఆ విషయం ఈ మధ్య వైరల్ కావడం తెలిసిందే. ఈ విషయంపై తీవ్రంగా స్పందించిన రాజ్ కుంద్రా.. తన మాజీ భార్యపై తీవ్రమైన ఆరోపణలు చేశారు. తన మాజీ భార్య కవిత.. తన సోదరి రీనా భార్తతో వివాహేతర సంబంధం పెట్టుకుందని సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో.. ఈ విషయం హాట్ టాపిక్ గా మారిపోయింది.
తాజాగా.. ఈ విషయమై కుంద్రా సోదరి రీనా కూడా స్పందించడం గమనార్హం. ఈ అంశంపై రీనా మాట్లాడుతూ.. కవిత తన భర్తతో ఎఫైర్ పెట్టుకోవడం నిజమేనని చెప్పడం మరింత సంచలనంగా మారింది. ఆమెను ఒక సోదరిలా చూశానని, కానీ.. తాను మాత్రం ఏకంగా తన భర్తతో సంబంధం పెట్టుకుందని చెప్పింది. ఈ విషయం తెలిసి తాను ఎంతో ఆవేదనకు గురయ్యానని తెలిపింది.
కవితతో విడిపోయిన తర్వాత కుంద్రా - శిల్పాశెట్టి 2009లో వివాహం చేసుకున్నారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ విషయంపై వీరు పెద్దగా స్పందించింది లేదు. కానీ.. ఇంటర్వ్యూల్లో శిల్పాశెట్టిపై కవిత ఆరోపణలు చేయడంతో రాజ్ కుంద్రా సీరియస్ అయ్యారు. కవిత మీడియా నుంచి డబ్బులు తీసుకొని, ఈ విధమైన ఆరోపణలు చేస్తోందని మండిపడ్డారు.
కవిత చేసిన ఆరోపణలు ఖండించడంతోపాటు ఆమెకు తన సోదరి భర్తతో రిలేషన్ ఉందని ఎవ్వరూ ఊహించని ఆరోఫలను చేశారు. ఈ విషయమై తన తల్లి పలుమార్లు మందలించినా.. కవిత ప్రవర్తన మార్చుకోలేదని అన్నారు. అందువల్లే తాను ఆమె నుంచి విడాకులు తీసుకున్నట్టు చెప్పారు. అమెరికా వెళ్లినప్పుడల్లా వాళ్లిద్దరూ కలుసుకునేవారని అన్నారు కుంద్రా. ఈ ఆరోపణలు నిజమేనని ఆయన సోదరి రీనా ధ్రువీకరించడం మరింత ప్రాధాన్యత సంతరించుకుంది.