అక్టోబరు 9న రుద్రమదేవి రాదంట అన్న రూమర్ వినిపించడం ఆలస్యం సడెన్ గా తన ‘షేర్’ సినిమాను రేసులోకి తెచ్చేశాడు కళ్యాణ్ రామ్. రుద్రమదేవి ఖాళీ చేసిన తేదీకి కర్చీఫ్ వేసేశాడు. కానీ గుణశేఖర్ మళ్లీ వెనక్కి తగ్గి ‘రుద్రమదేవి’ని అనుకున్న తేదీకి రిలీజ్ చేయాలని భావించడంతో కళ్యాణ్ రామ్ మనసు మార్చుకోక తప్పలేదు. అక్టోబరు 9న రుద్రమదేవి పక్కా అని తేలిపోవడంతో ‘షేర్’ సినిమా నెలాఖరుకు వెళ్లిపోయింది. అక్టోబరు 30న ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తేవాలని కళ్యాణ్ రామ్ అండ్ కో ఫిక్సయింది. అక్టోబరు 16న ‘బ్రూస్ లీ’, 22న ‘అఖిల్’ లైన్ లో ఉన్నాయి. ఆ తర్వాతి శుక్రవారాన్ని కళ్యాణ్ రామ్ బుక్ చేసుకున్నాడు.
కళ్యాణ్ రామ్ తో ఇంతకుముందు అభిమన్యు, కత్తి లాంటి ఫ్లాప్ సినిమాలు తీసిన మల్లికార్జున్ మూడో ప్రయత్నంలో తీస్తున్న సినిమా ఇది. లెజెండ్ ఫేమ్ సోనాల్ చౌహాన్ ఇందులో కళ్యాణ్ రామ్ సరసన నటిస్తోంది. విజయలక్ష్మీ పిక్చర్స్ పతాకంపై కొమర వెంకటేష్ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. ‘‘మా సినిమా షూటింగ్ పూర్తయింది. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ చేస్తున్నాం. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి అక్టోబరు 30న సినిమాను విడుదల చేయబోతున్నాం. థమన్ అద్భుతమైన సంగీతం అందించాడు. అక్టోబరు 10న ఆడియో ఫంక్షన్ గ్రాండ్ గా చేస్తున్నాం. ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ కొత్త డైమన్షన్ లో కనిపిస్తాడు. మల్లికార్జున్ చాలా చక్కగా సినిమాను మలిచాడు. షేర్.. కళ్యాణ్ రామ్ కు పటాస్ ను మించిన సక్సెస్ ఇస్తుంది’’ అని నిర్మాత తెలిపాడు.