బాలీవుడ్ లో వెలుగు చూసిన డ్రగ్ వ్యవహారంలో రోజుకొక సంచలన విషయం బయటపడుతోంది. బాలీవుడ్ డ్రగ్స్ రాకెట్ పై ఫోకస్ పెట్టిన నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు ఇప్పటికే పలువురిని అరెస్ట్ చేసిన మరికొందరిని విచారిస్తున్నారు. ఈ క్రమంలో క్వాన్ (KWAN) అనే ప్రముఖ టాలెంట్ మేనేజ్‌మెంట్ ఏజెన్సీ కూడా డ్రగ్ వ్యవహారంలోకి వచ్చింది. సుశాంత్ కేసుకు లింక్స్ ఉన్నాయనే కోణంలో ఇప్పటికే ఎన్సీబీ అధికారులు క్వాన్ సీఈఓను విచారించినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా క్వాన్ తరపున వివిధ నటీనటుల కోసం పనిచేస్తున్న మేనేజర్స్ ని కూడా డ్రగ్స్ వ్యవహారంలో విచారించనున్నారు. ఈ క్రమంలో క్వాన్ కు సంబంధించిన విషయాలు ఒక్కటొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా హీరోయిన్ షెర్లిన్ చోప్రా క్వాన్ ట్యాలెంట్ ఏజెన్సీ అధినేత అనిర్భన్ తన వక్షోజాల గురించి అసభ్యంగా మాట్లాడాడని సంచలన ఆరోపణలు చేసింది.
షెర్లిన్ చోప్రా మాట్లాడుతూ.. ''సినిమా అవకాశాల కోసం క్వాన్ అనిర్భన్ ను కలిశాను. అతను నన్ను పై నుంచి కింద వరకు చూశాడు. 'ఏమైంది సర్.. నా డ్రెస్ బాగోలేదా' అని నేను అడిగాను. 'కాదు.. నీ బ్రెస్ట్ రియలేనా? ఫేక్ నా? నేను వాటిని టచ్ చేయొచ్చా అని అడిగాడు. నేను షాకయ్యాను. అవి రియల్ అయినా.. కాకపోయినా అతనికేంటి సమస్య? ఓ మహిళతో అలా మాట్లాడకూడదు'' అని చెప్పుకొచ్చింది. అంతేకాకుండా డ్రగ్స్ కేసులో ఎన్సీబీ నోటీసులు అందుకున్న హీరోయిన్ దీపికా పడుకునే ని ఉద్దేశిస్తూ ట్విట్టర్ లో ఓ వీడియో షేర్ చేసింది. ''దీపికా 'రిపీట్ ఆఫ్టర్ మీ. డిప్రెషన్ ఒక అనారోగ్యం' అని స్లోగన్ చెప్పింది. గ్లోబల్ రీసెర్చ్ ప్రకారం 90% డిప్రెషన్ కేసులు డ్రగ్స్ కు సంబంధించినవే. ప్రతి డిప్రెషన్ కేసు కాదు.. కానీ 90%. కాబట్టి దీపికా పదుకొనే తన నినాదాన్ని మార్చాలని నేను అనుకుంటున్నాను. దీపికా తన స్లోగన్ ని 'నేను డ్రగ్స్ దుర్వినియోగానికి పాల్పడను' అని మార్చాలి'' అని షెర్లిన్ చోప్రా పేర్కొన్నారు. తెలుగులో 'ఏ ఫిలిం బై అరవింద్' 'సంథింగ్ స్పెషల్' చిత్రాల్లో షెర్లిన్ చోప్రా నటించింది.
Full View Full View Full View