ఓవైపు వివాదాలతో అంటకాగుతున్నా మరోవైపు వాణిజ్య ప్రకటనల్లో నటిస్తూ ఆర్జిస్తోంది శిల్పాశెట్టి. తనకు ఇంకా బ్రాండ్ వ్యాల్యూ ఎంతమాత్రం తగ్గలేదని ప్రూవ్ చేస్తోంది. వరుస ఫోటోషూట్లతో ఓవైపు ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. శిల్పాజీ లేటెస్ట్ ఫోటోషూట్ ఇప్పుడు అంతర్జాలంలో హాట్ టాపిక్ గా మారింది. ఇది గోల్డ్ అండ్ పింక్ కలర్ డిజైనర్ షిమ్మరీ డ్రెస్. ఇందులో శెట్టి మ్యాడమ్ సాగరకన్యనే తలపించింది. స్పార్కుల్ ఆన్ .. డార్లింగ్ ! అన్న క్యాప్షన్ తో ఈ లుక్ ని శిల్పా శెట్టి షేర్ చేయగా దానికి అభిమానులు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇటీవల ఓ అవార్డుల వేడుకలో శిల్పాశెట్టి లుక్ సంథింగ్ హాట్ అన్న టాక్ వినిపించింది.
ఇక వివాదాల మ్యాటర్ కి వస్తే.. ఇటీవలే శిల్పాజీ భర్త రాజ్ కుంద్రా నీలి చిత్రాల కేసులో అరెస్టయి బెయిల్ పై విడుదలైన సంగతి తెలిసిందే. ఆ తర్వాత చాలా కాలానికి ఈ జంట పబ్లిక్ అప్పియరెన్స్ పైనా చర్చ సాగింది. ఈ లైఫ్ ఇలా సాగుతుండగానే మరో వివాదం కూడా ఉక్కిరిబిక్కిరి చేసింది.
నితిన్ బరాయ్ అనే వ్యక్తి ఫిర్యాదు మేరకు నటి శిల్పాశెట్టి ఆమె భర్త రాజ్ కుంద్రాపై గత కొద్ది రోజుల క్రితం ఎఫ్.ఐ.ఆర్ నమోదైంది. ముంబైలోని బాంద్రా పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. ఈ పరిణామంపై శిల్పాశెట్టి కుంద్రా స్పందిస్తూ, .. రాజ్ మరియు నా పేరుపై నమోదైన ఎఫ్.ఐ.ఆర్ తో మేల్కొన్నాను! షాక్ అయ్యాను!! అని అన్నారు.
కేసు దేనికి సంబంధించింది? అంటే 2014 జూలైలో ఎస్ ఎఫ్ ఎల్ ఫిట్ నెస్ కంపెనీ డైరెక్టర్ కాషిఫ్ ఖాన్....తో డీల్ వ్యవహారమిది. శెట్టి- కుంద్రా ఇతరులతో కలిసి లాభాలను ఆర్జించడానికి ఎంటర్ ప్రైజ్ లో రూ. 1.51 కోట్లు పెట్టుబడి పెట్టమని అడిగారని కథనాలొచ్చాయి.
SFL ఫిట్ నెస్ కంపెనీ తనకు ఫ్రాంచైజీని అందజేస్తుందని పొరుగున ఉన్న పూణేలోని హడప్సర్ - కోరేగావ్ లలో జిమ్ స్పాను తెరిచే ప్రణాళిక ఇదని తనకు హామీ ఇచ్చారని ఫిర్యాదుదారు పేర్కొన్నాడు. అయితే అది కార్యరూపం దాల్చనందున FIR నమోదైంది. ఆ డీల్ కుదరకపోవడంతో తరువాత ఫిర్యాదుదారు తన డబ్బును వెనక్కి ఇవ్వాల్సిందిగా కోరినప్పుడు తనను బెదిరించారని పోలీసు అధికారి తెలిపారు.
ఫిర్యాదు ఆధారంగా.. బాంద్రా పోలీసులు 420 (మోసం).. 120-బి (నేరపూరిత కుట్ర),... 506 (నేరపూరిత బెదిరింపు), .. 34 (సాధారణ ఉద్దేశ్యం) సహా వివిధ భారతీయ శిక్షాస్మృతి సెక్షన్ల కింద ఎఫ్.ఐ.ఆర్ నమోదు చేశారు. ఇటీవల ఈ కేసుపై విచారణ సాగుతోంది.