ఘాజీ.. ఇండియాలో తెరకెక్కిన తొలి సబ్ మెరైన్.. అండర్ వాటర్ వార్ ఫిల్మ్ గా గుర్తింపు తెచ్చుకున్న సినిమా. హిందీలో కరణ్ జోహార్ లాంటి పెద్ద నిర్మాత ఈ చిత్రంపై ఎంతో నమ్మకంగా తన బేనర్ ద్వారా రిలీజ్ చేస్తున్నాడు. పీవీపీ సినిమా లాంటి పెద్ద బేనర్ ఈ చిత్రాన్ని నిర్మించడానికి ముందుకొచ్చింది. వంద కోట్లకు పైగా బడ్జెట్లో తెరకెక్కిన సినిమా ఇది. ఇంత భారీ చిత్రాన్ని ఒక నూతన దర్శకుడు రూపొందించడం విశేషమే. ఆ దర్శకుడి పేరు సంకల్ప్ రెడ్డి. మన తెలుగువాడే. ఐతే ఈ సినిమా అతనొక్కడి వల్లే సాధ్యం కాలేదు. దర్శకులు కావాలనుకున్న ముగ్గురు యువకులు కలిసి చేసిన మహత్తర ప్రయత్నమిది. సంకల్ప్ తో పాటు ఆర్ట్ డైరెక్టర్ శివం రావు.. విజువల్ ఎఫెక్ట్స్ నిపుణుడు వాసుదేవ్ కలిసి ఒక లఘు చిత్రంగా ‘ఘాజీ’ని తీయాలనుకుంటే అది ఇంత పెద్ద ప్రాజెక్టు అయింది. శివం.. వాసుదేవ్ కూడా దర్శకులు కావాలనుకున్న వాళ్లే. కానీ సంకల్ప్ కోసం ఈ చిత్రానికి వేరే విభాగాల్లో పని చేశారు. తమ ప్రయాణం ఎలా సాగిందో వివరిస్తూ శివం రావు.. ఒక ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు చెప్పాడు.
‘‘స్వతహాగా నేనో ఇంటీరియర్ డిజైనర్. అందుకు సంబంధించి నాకొక కంపెనీ కూడా ఉంది. మధ్యలో నాకు సినిమా దర్శకత్వంపై మనసు మళ్లింది. దాంతో చెన్నైలోని ఓ ఇన్‌స్టిట్యూట్‌లో దర్శకత్వానికి సంబంధించి కోర్సు చేశా. ఆ తర్వాత ‘కో అంటే కోటి’ సినిమాకి అనీష్ కురువిల్లా దగ్గర సహాయ దర్శకుడిగా చేరా. అక్కడ నాకు కళా విభాగానికి సంబంధించిన బాధ్యతలు అప్పజెప్పారు. ఆ సినిమాకి నాతో పాటు కలిసి పనిచేసిన మరో సహాయ దర్శకుడే సంకల్ప్. సినిమా తర్వాత కొన్నాళ్లకి సంకల్ప్ ‘ఘాజీ’ కథ చెప్పాడు. ఇది జాతీయస్థాయిలో చెప్పాల్సిన కథ అనిపించింది. మొదట ఆ సినిమాని ఒక లఘు చిత్రంగా తీయాలని సంకల్ప్ అనుకున్నాడు. ప్రొడక్షన్ డిజైనింగ్ బాధ్యతలు నేను తీసుకొన్నా. దర్శకత్వ విభాగం నుంచే వచ్చిన మరో మిత్రుడు వాసుదేవ్ విజువల్ ఎఫెక్ట్స్ బాధ్యతలు అందుకున్నాడు. లఘు చిత్రమే అయినా కథ రీత్యా సబ్ మెరైన్ సెట్ వేయాలనుకున్నాం. ఆరు నెలల పాటు హైదరాబాద్ తుక్కు మార్కెట్లలో తిరిగి సెట్ కోసం కావాల్సిన చాలా సామగ్రి తెచ్చుకున్నాం. లోయర్ ట్యాంక్ బండ్ దగ్గర సెట్ వేశాం. అది నిర్మాత రామ్మోహన్ గారు చూసి ఆరా తీశారు. తర్వాత పీవీపీ గారు కలిశారు. సంకల్ప్ వేసుకొన్న స్టోరీ బోర్డు.. నేను వేసిన సెట్.. సినిమా చిత్రీకరణకి ముందే వాసుదేవ్ తీర్చిదిద్దిన విజువల్ ఎఫెక్ట్స్... ఇవన్నీ ఆయన్ని ఆకట్టుకున్నాయి. మాకు అనుభవం లేకపోయినా.. మీరే ఈ సినిమా చేయగలరంటూ మమ్మల్నే ప్రోత్సహించారు’’ అని శివం రావు తెలిపాడు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/