తెలుగు చిత్రసీమకి కొత్త తలనొప్పులు ఎదురవుతున్నాయి. వీసాల కోసం కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పరిస్థితులు తలెత్తాయి. ఈమధ్య సినిమాలు ఎక్కువగా విదేశాల్లో చిత్రీకరణని జరుపుకుంటున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా అమెరికాలో తెలుగు సినిమాల హంగామా ఎక్కువగా కనిపిస్తుంటుంది. కనీసం ఒకట్రెండు పాటలయినా అక్కడ తీద్దాం అని ఆశించేవాళ్లు ఎంతోమంది. కానీ ఇప్పుడు అక్కడికి వెళ్లడం అంత ఆషామాషీగా జరిగే పని కాదనిపిస్తోంది. అమెరికాలో వెలుగు చూసిన సెక్స్ రాకెట్ వ్యవహారం తెలుగు ఇండస్ట్రీ మొత్తంపై మచ్చ పడేలా చేసింది. దాంతో చాలా మందికి వీసాలు లభించడం లేదు.
తాజాగా `2 స్టేట్స్` చిత్రబృందానికి కూడా అదే సమస్య ఎదురైంది. ముఖ్యంగా అందులో కథానాయికగా నటిస్తున్న శివానీ రాజశేఖర్ కి కూడా వీసా లభించలేదట. పలుమార్లు దౌత్య కార్యాలయాల చుట్టూ తిరిగినా పని కాలేదట. ఆ చిత్రబృందంలోని మరికొద్దిమందికి కూడా వీసా దొరకలేదని సమాచారం. దాంతో `2 స్టేట్స్` షెడ్యూల్ లండన్ లో చేయాలని నిర్ణయించుకున్నారట. అమెరికాలో మోదుగులమూడి నడిపిన సెక్స్ రాకెట్ వ్యవహారమే ఈ తలనొప్పులకి కారణమైంది. మామూలుగా అయితే ఇదివరకు సినిమావాళ్లకు సులభంగా వీసాలు లభించేవి. అక్కడ దాదాపు సినిమాలు చిత్రీకరణ జరుపుకొనేవి. కానీ ఈ మధ్య మాత్రం స్టార్ హీరోల సినిమాల యూనిట్లకి మాత్రం వీసాలు - అనుమతులు లభిస్తున్నాయి. అమెరికాలో అధికారుల తీరు చూస్తుంటే ఈ తలనొప్పులు ఇప్పట్లే తగ్గేలా కనిపించడం లేదని చెబుతున్నాయి పరిశ్రమ వర్గాలు.