చిరు, బాలయ్యలు నాకు బిడ్డలతో సమానం: అలనాటి స్టార్ హీరో

Update: 2020-06-18 15:30 GMT
టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో అలనాటి అందాల హీరో సోగ్గాడు శోభన్ బాబు అంటే సినీప్రేక్షకులలో విపరీతమైన క్రేజ్. ఆనాటి స్టార్ హీరోలు ఎన్టీఆర్.. ఏయన్నార్.. కృష్ణ లతో పాటు దశాబ్దాల పాటు ఇండస్ట్రీని అలరించిన ఘనత శోభన్ బాబుది. నటన పరంగాను వ్యక్తిత్వం పరంగాను ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. అప్పట్లో ఆయనకున్న లేడీ ఫాలోయింగ్ ఏ హీరోకి లేదు. అటు రొమాంటిక్.. ఇటు ఎమోషనల్ సినిమాల హీరోగా శోభన్ బాబు మనసులు గెలిచారు. అయితే ఆయన స్టార్ గా కొనసాగుతున్న టైంలోనే చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున లాంటి యంగ్ హీరోలు స్టార్లుగా ఎదుగుతున్నారు. అయితే స్టార్డం ఎంజాయ్ చేస్తున్న 1993లో ఓ సన్మాన సభకు హాజరైన శోభన్ బాబు.. చిరంజీవి, బాలకృష్ణ లాంటి వారు తన బిడ్డలతో సమానమని సంబోధించారు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

80.. 90ల దశకంలో శోభన్ బాబు సినిమా అంటే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉండేవి. ఆ టైంలో ఏడాదికి పదుల సంఖ్యలో సినిమాలు చేసిన శోభన్ బాబు.. హీరోగా మాత్రమే రిటైర్ అవ్వడం షాక్ ఇచ్చిన విశేషం. ఇక ఆ సన్మాన వేడుకలో శోభన్ బాబును.. చిరంజీవి, బాలకృష్ణ లాంటి హీరోలు మీకు పోటీగా అనిపించట్లేదా..? అని అడిగిన ప్రశ్నకు ఆయన స్పందించి ఇలా అన్నారు. "చిరంజీవి.. బాలకృష్ణ లాంటి హీరోలు నాకు బిడ్డలతో సమానం. వాళ్లు నా కొడుకు వయసులో ఉన్నారు. కాబట్టి వాళ్లను నేను పోటీగా భావించట్లేదు. ఏ తండ్రి కూడా బిడ్డలను పోటీగా భావించడు" అన్నారు. అంతేగాక అభిమానులను ఉద్దేశించి.. 'మీరేం గొడవలు పడకండి. నచ్చకపోతే దూరంగా ఉండండి కానీ ఎలాంటి గొడవలకు దారి తీయకండి" అంటూ పిలుపునిచ్చారు. ఇక ఆయన హీరోగానే రిటైర్ అయ్యి ఎంతోమందికి స్ఫూర్తిగా నిలుస్తున్నారు సోగ్గాడు శోభన్ బాబు.
Tags:    

Similar News