2020 మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా మూవీ #RRR పై భారీ బెట్టింగ్ నడుస్తున్న సంగతి తెలిసిందే. దాదాపు 230 కోట్ల మేర కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే బిజినెస్ చేసిందని రివీలైంది. ఓవర్సీస్ .. ఇతర మార్కెట్ల నుంచి భారీగానే రెవెన్యూ రప్పించే ప్లాన్ లో ఉన్నారు దర్శకనిర్మాతలు. మెగా-నందమూరి అభిమానుల్లో భారీ అంచనాలు నేపథ్యంలో ఈ సినిమా ఓపెనింగులకు ఎలాంటి డోఖా ఉండదన్న కాన్ఫిడెన్స్ వ్యక్తమవుతోంది. దర్శకధీరుడు రాజమౌళి బాహుబలి తర్వాత అంతే ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం కావడంతో అంచనాలు వేడెక్కిస్తున్నాయి.
విప్లవ వీరులు అల్లూరి సీతారామరాజు పాత్రలో రామ్ చరణ్.. కొమురం భీమ్ పాత్రలో ఎన్టీఆర్ ఒదిగిపోయి నవరసాల్ని పండిస్తున్నారన్న సమాచారం ఉంది. జక్కన్న భారీ యాక్షన్ ఎపిసోడ్స్ తో గగుర్పొడిచే విన్యాసాలతో విజువల్ వండర్ గా మలుస్తున్నారు. ముఖ్యంగా బల్గేరియా అడవుల్లో బెంగాల్ టైగర్ తో తారక్ తలపడే సీన్... చరణ్ వార్ ఎపిసోడ్స్ అంతే ధీటుగా మెప్పిస్తాయని తెలుస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన ఏ విషయాన్ని బయటకు రాకుండా జక్కన్న జాగ్రత్త పడుతున్నా.. తామరతంపరగా లీకులు ఫ్యాన్స్ లో ఆసక్తిని పెంచుతున్నాయి. తాజాగా ఆర్.ఆర్.ఆర్ సెట్ ని విజిట్ చేసిన బాహుబలి నిర్మాత శోభు యర్లగడ్డ ఆర్.ఆర్.ఆర్ ఔట్ పుట్ ని ఆకాశానికెత్తేశారు.
ట్విటర్ లో ఓ అభిమాని శోభుని ప్రశ్నించారు. ఆర్.ఆర్.ఆర్ ఎలా ఉండబోతోంది? అంటూ ప్రశ్నించాడు. దానికి శోభు ఈ మూవీ కథ నాకు తెలియదు. నిజం చెప్పాలంటే ఆర్.ఆర్.ఆర్ షూటింగ్ కి ఒక్క రోజు మాత్రమే వెళ్లాను. కానీ బొమ్మ మాత్రం ఇండస్ట్రీ హిట్టు! అని అన్నారు. ప్రస్తుతం ఆయన కామెంట్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. మెగా- నందమూరి అభిమానుల ఉత్సాహాన్ని మరింత రెట్టింపు చేసేలా కామెంట్ ఉండటంతో దాన్ని జోరుగా వైరల్ చేస్తున్నారు.