హీరోయిన్ల‌ను ప‌డేయ‌డ‌మే ఇత‌గాడి ప‌ని

Update: 2022-01-12 14:30 GMT
200 కోట్ల కుంభకోణంలో అరెస్ట్ అయిన సుకేష్ చంద్ర శేఖ‌ర్ పేరు ఇప్పుడు దేశ వ్యాప్తంగా మార్మోగుతున్న సంగ‌తి తెలిసిందే. పోలీసుల విచార‌ణ‌లో సుకేష్ గురించి విస్తుపోయే వాస్త‌వాలు బ‌య‌ట‌కు వ‌స్తున్నాయి. `కాన్ మాన్` (తెలివైన‌ మోస‌గాడు) అనే ట్యాగ్ అత‌డి ఇంటి పేరే అయ్యింది. తెలివిగా మోసాలు చేయ‌డంలో సుకేష్ దిట్ట‌. జ‌ల్సాలా కోసం రూపం మార్చుకుంటూ బ‌డా బాబుల్ని మోసం చేయ‌డంలో ఇత‌గాడికి పెద్ద ట్రాక్ రికార్డ్ నే ఉంది. 18 ఏళ్ల వ‌య‌సులోనే జైలు జీవితం గ‌డిపొచ్చాడు. అయినా త‌న‌లో ఎలాంటి మార్పు రాలేదు. జైల్లో ఉంటూనే బ‌య‌ట త‌న దందాల్ని య‌థేచ్ఛ‌గా కొన‌సాగించాడంటే సుకేష్ ఎంత తెలివైన మోస‌గాడో అర్థం చేసుకోవ‌చ్చు.

సుకేష్  మోసాల వెనుక అత‌ని  భార్య పాత్ర ఎంతో కీల‌క‌మ‌ని కూడా విచార‌ణ‌లో తేలింది. ఇక సుకేష్ కి ఉన్న అల‌వాటు గాళ్స్. అదీ సెల‌బ్రిటీలంటే సుకేష్ డ‌బ్బు చ‌ల్లేస్తాడు. ఎన్ని కోట్లైనా విచ్చ‌ల విడిగా ఖ‌ర్చు చేస్తాడు. ఇప్ప‌టికే సుకేష్ ఖాతాలో  బాలీవుడ్ హీరోయిన్లు జాక్వెలిన్ ఫెర్నాండేజ్.. నోరా ప‌తేహీ ఉన్న‌ట్లు నిర్ధార‌ణ అయింది. జాకీ-సుకేష్ స‌న్నిహితంగా ఉన్న ఫోటోలు సైతం బ‌య‌ట‌కు లీకైన సంగ‌తి తెలిసిందే. ఇద్ద‌రు భామ‌ల‌కి ఖ‌రీదైన బ‌హుమ‌తులు..ప్లాట్లు గిప్ట్ లుగా అందించిన‌ట్లు ఆధారాల‌తో స‌హా దొరికారు. ఇంకా  శ్ర‌ద్దా క‌పూర్..శిల్పా శెట్టి  స‌హా మ‌రో ఎనిమిది మంది బాలీవుడ్ హీరోయిన్ల‌తో సుకేష్ కి సంబంధాలు ఉన్న‌ట్లు ప్ర‌చారం సాగుతోంది.

అయితే శ్ర‌ద్ధాక‌పూర్. .శిల్పాశెట్టితో సుకేష్ కి ఉన్న రిలేష‌న్స్ ఎలాంటివి? అన్న‌ది ఇంకా బ‌య‌ట‌కు రాలేదు. ఈడీ విచార‌ణ నేప‌థ్యంలో ఆ సంగ‌తులు బ‌య‌టప‌డ‌నున్నాయి. మిగిలిన హీరోయిన్ల పేర్ల‌ను ఈడీ విచార‌ణ‌లో బ‌య‌ట‌కు వ‌చ్చే అవ‌కాశం ఉంది. ఏది ఏమైనా సుకేష్ కి మాత్రం హీరోయిన్ల‌ను బుట్ట‌లో వేయడం ఓ హాబీగా క‌నిపిస్తోంది. ఖ‌రీదైన బ‌హుమతులు అందించి ఇంప్రెస్ చేయ‌డం సుకేష్ లో మ‌రో ట్యాలెంట్ గా క‌నిపిస్తోంది. కోట్లకు కోట్లు దోచి పెట్టి ఎంత‌టి అంద‌గ‌త్తెను అయినా దారికి తెచ్చుకోవ‌డంలో అత‌డి ప‌నితనం వైఖ‌రి దీనిని బ‌ట్టి  అర్థ‌మ‌వుతోంది. కాన్ మేన్ పై ఇప్పుడు బ‌యోపిక్ తెర‌కెక్కించేందుకు కూడా రంగం సిద్ధ‌మ‌వుతున్న సంగ‌తి తెలిసిందే. కేసు విచార‌ణ ముగిసే స‌మ‌యానికి ఈ బ‌యోపిక్ స్క్రిప్టు కూడా రెడీ అయిపోతుంది.
Tags:    

Similar News