మెగాస్టార్ చిరంజీవి కెరీర్లో 152వ మూవీగా తెరకెక్కుతోంది ఆచార్య. సక్సెస్ ఫుల్ సినిమాల దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ సినిమా పై మెగా అభిమానులలో రోజురోజుకి అంచనాలు పెరుగుతూనే ఉన్నాయి. ఈ మెగా మల్టీస్టారర్ మూవీని మాట్నీ ఎంటర్టైన్మెంట్స్, కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ లపై నిరంజన్ రెడ్డి, రాంచరణ్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమాకు ఆచార్య టైటిల్ అనౌన్స్ మెంట్ జరిగినప్పటి నుండే సినిమా పై హైప్ క్రియేట్ అయింది. ప్రస్తుతం ఆచార్య సినిమా షూటింగ్ దశలో ఉంది. ఇంకా షూటింగ్ కూడా కొద్దీ రోజులు మాత్రమే బాలన్స్ ఉన్నట్లు టాక్.
అయితే ఫ్యాన్స్ ఎక్సపెక్ట్ చేసినట్లుగా ఈ మెగాస్టార్ మూవీ నుండి అప్డేట్స్ అన్ని ఒక్కసారిగా ప్రకటించి సర్ప్రైజ్ చేసారు మేకర్స్. ఓవైపు ఆచార్య టీజర్ తో పాటు లాహేలాహే సాంగ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ సినిమాలో మెగాపవర్ స్టార్ రాంచరణ్ కూడా ఓ కీలకపాత్ర పోషిస్తుండగా.. స్టార్ హీరోయిన్ పూజాహెగ్డే రాంచరణ్ జోడిగా కనిపించనుంది. అయితే ఈ సినిమాలో రాంచరణ్ సిద్ధ అనే పేరుతో విద్యార్ధి సంఘానికి నాయకుడుగా నక్సలైట్ గా కనిపించనున్నట్లు తెలుస్తుంది. అందుకు సంబంధించిన పోస్టర్ కూడా రాంచరణ్ బర్త్ డే రోజున రిలీజ్ చేశారు. అయితే సినిమా రిలీజ్ సమయానికి కరోనా కారణంగా వాయిదా పడటంతో మెగాఫ్యాన్స్ చాలా నిరాశకు లోనయ్యారని సమాచారం.
ఎందుకంటే ఈ మెగా మల్టీస్టారర్ మూవీ రిలీజ్ డేట్ మే 13. అంటే ఇప్పటికి ఆచార్య విడుదలై పది రోజులు కావాల్సింది. కానీ కరోనా పరిణామాలు పరిస్థితులను తారుమారు చేసాయి. దేశంలో కరోనా విలయతాండవం చేస్తుండటంతో సినిమా మళ్లీ వాయిదా పడింది. కానీ మళ్లీ రిలీజ్ ఎప్పుడనేది మాత్రం పరిస్థితి చక్కబడ్డాకే తెలియనుంది. అయితే తాజాగా మెగాస్టార్ సినిమా రిలీజ్ డేట్ గురించి పలు వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ సినిమాను దసరా - దీవాలికి రాబోతుందని ఎక్సపెక్ట్ చేస్తుండగా మధ్యలో సినిమాను మేకర్స్ వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు పుకార్లు వినిపిస్తున్నాయి. మరి ఎంతవరకు నిజమో తెలియదు కానీ ఒకవేళ అదే నిజమైతే మాత్రం మెగాఫ్యాన్స్ ఖచ్చితంగా సంక్రాంతి వరకు వెయిట్ చేయాల్సిందే.