షాకిస్తున్న డైరెక్ట‌ర్ రెమ్యున‌రేష‌న్‌

Update: 2019-04-04 04:49 GMT
ఒక్క ఫ్లాప్ అయినా లేకుండా వ‌రుస విజ‌యాల‌తో దూసుకుపోతున్నాడు అనీల్ రావిపూడి. ప‌టాస్- రాజా ది గ్రేట్- ఎఫ్ 2 చిత్రాలు బంప‌ర్ హిట్లుగా నిలిచాయి. ఈ సినిమాల‌తో అత‌డి క్రేజు స్కైని ట‌చ్ చేస్తోంది. ఇప్పుడున్న స్టార్ డైరెక్ట‌ర్ల‌కు ఏమాత్రం తీసిపోని ప్ర‌తిభావంతుడిగా తెర‌పైకి దూసుకొచ్చిన అనీల్ రావిపూడి ప్ర‌స్తుతం భారీ పారితోషికం డిమాండ్ చేస్తున్నార‌ని తెలుస్తోంది.

అనీల్ రావిపూడి తెర‌కెక్కించిన రీసెంట్ బ్లాక్ బ‌స్ట‌ర్ `ఎఫ్ 2` బాక్సాఫీస్ వ‌ద్ద ఏకంగా 80కోట్ల షేర్ వ‌సూలు చేసింది. ఆ వెంట‌నే మ‌రోసారి దిల్ రాజు నిర్మాణంలోనే అత‌డు భారీ చిత్రం చేస్తుండ‌డం ఆస‌క్తిక‌రం. దీంతో పాటే ఎఫ్ 2 సీక్వెల్ కి స‌న్నాహాలు చేస్తున్నారు. 2019-2022 వ‌ర‌కూ అనీల్ రావిపూడి డైరీలో `నో రూమ్‌` అన్న స‌న్నివేశ‌మే క‌నిపిస్తోంది. అంతేకాదు అత‌డు ఒక్కో క‌మిట్‌ మెంట్ కి 12కోట్ల డిమాండ్ చేస్తున్నా అంత పెద్ద మొత్తం ఇచ్చేందుకు నిర్మాత‌ల‌కు ఎలాంటి అభ్యంత‌రం లేద‌ట‌. ప్ర‌స్తుతం మ‌హేష్‌- ఏకే ఎంట‌ర్‌ టైన్‌ మెంట్స్ - శ్రీ‌వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ మూవీ తో ఈ యంగ్ డైరెక్ట‌ర్ బిజీ బిజీగా ఉన్నారు. ఈ సినిమా ప్రీప్రొడ‌క్ష‌న్ ప‌నులు వేగంగా పూర్త‌వుతున్నాయి. త్వ‌ర‌లోనే లాంఛ‌నంగా సినిమాని ప్రారంభించ‌నున్నార‌ని తెలుస్తోంది. అనీల్ రావిపూడి స్పీడ్ చూస్తుంటే కొర‌టాల‌, సుకుమార్, త్రివిక్ర‌మ్ లాంటి స్టార్ డైరెక్ట‌ర్ల‌కు కూత‌వేటు దూరంలోనే ఉన్నాడ‌ని అర్థ‌మ‌వుతోంది. పారితోషికాల్లో స్టార్ డైరెక్ట‌ర్లు అంతా 10-15 కోట్ల క్ల‌బ్ లో ఉన్నారు. ఇప్పుడు అనీల్ రావిపూడి ఈ క్ల‌బ్ లో చేరిపోయాడు. ద‌ర్శ‌క‌ధీరుడు ఎస్.ఎస్. రాజ‌మౌళి మాత్రం 20 కోట్లు పైగా అందుకుంటున్నారు. రాజ‌మౌళి, కొర‌టాల స‌హా కొంద‌రు ద‌ర్శ‌కులు లాభాల్లో వాటాలు తీసుకుంటున్నారు. ఒక్కో మెట్టు ఎక్కుతూ అనీల్ రావిపూడి శిఖ‌రాన్ని ట‌చ్ చేయ‌డం ఖాయం అని అంచ‌నా వేస్తున్నారు.

ఇండ‌స్ట్రీలో దీపం ఉండ‌గానే చ‌క్క‌దిద్దుకోవ‌డం ముఖ్యం! స్టార్ల‌తో పాటు పాపులారిటీ ఉన్న ద‌ర్శ‌కులు ఇది ఫాలో అవుతుంటారు. స‌క్సెస్ ఉన్న‌ప్పుడే నాలుగు డ‌బ్బులు వెన‌కేసుకోవాలని భావిస్తుంటారు. ఆ కోవ‌లో చూస్తే న‌వ‌త‌రం ద‌ర్శ‌కుడు అనీల్ రావిపూడి గేమ్ ప్లాన్ జ‌రంత భ‌ద్రంగానే ఉంద‌ని అర్థ‌మ‌వుతోంది. ఫ్లాపులొస్తే నిర్ధాక్షిణ్యంగా దూరం పెట్టే ఈ ప‌రిశ్ర‌మ‌లో ప్లానింగ్ చాలా ఇంపార్టెంట్ అని నిరూపిస్తున్నాడ‌న్న‌మాట‌.
    

Tags:    

Similar News