సత్య రాజ్ అన్న పిలుపు కంటే బాహుబలి `కట్టప్ప`గానే ఎక్కువ పాపులరయ్యారు ఆయన. అంతటి పాపులారిటీ ఓవర్ నైట్ దక్కింది. ఇటు తెలుగువారిలోనూ గొప్ప ఫాలోయింగ్ తెచ్చుకున్నారు సీనియర్ నటుడు సత్యరాజ్. ప్రస్తుతం ఆయన `జెర్సీ` చిత్రంలో క్రికెట్ కోచ్ పాత్రలో నటించారు. అంత పెద్ద సీనియర్ తో నటించిన నాని ఆయనతో అయిన ఓ అనుభవం గురించి చెప్పారిలా.
సత్యరాజ్ గారితో ఈ సినిమా చేయడం నాకు లెర్నింగ్ ఎక్స్ పీరియెన్స్ లాంటిది. ఆయన సినిమా అంతటా ఉండరు. చాలా సీన్లు ఒక డైలాగ్ తోనే ఉంటాయి. అయితే ఆయన చెన్నయ్ లో ఉంటే హైదరాబాద్ కి ఒక్క డైలాగ్ సీన్ కోసమే రావాల్సిన పరిస్థితి ఉండేది. తనకు సౌకర్యంగా ఉందో లేదో అనిపించింది. ఒకసారి మధ్యాహ్నం ఎల్ బి స్టేడియంలో గంట రెండు గంటల్లో పూర్తయ్యే సీన్ తీస్తున్నాం. సత్యరాజ్ గారికి ఒక డైలాగ్ తో సీన్ ఉంది. ఆ టైమ్ కి చెబితే సరిపోతుందని అనుకున్నాం. ఆయనకు ఫోన్ చేస్తే అప్పుడు మధురైలో వేరొక షూటింగులో ఉన్నారు. మేం కన్ఫ్యూజన్ లో ఆయనకు ముందే చెప్పలేకపోయాం. అయినా ఆయన ఆ సెట్స్ లో వాళ్లను ఒప్పించి.. మధురై నుంచి చెన్నయ్ కి కార్ లో వచ్చి.. అక్కడి నుంచి విమానంలో హైదరాబాద్ కి వచ్చారు. రాత్రి టైమ్ కి తిరిగి ఆ షూట్ కి ఆయన వెనక్కి వెళ్లిపోవాలి. ఇక్కడ కారవ్యాన్ లో గంట వేచి చూశారు. ఇక్కడ మాకేదో కన్ఫ్యూజన్ లో .. ఇంత దూరం వచ్చాక సార్ మీ సీన్ లేనేలేదు! అని చెప్పాం. అందుకు ఆయన నొచ్చుకోకుండా `సరే సరే` అన్నారు కానీ.. అదేంటయ్యా? అన్న ఒక్క మాటైనా అనలేదు. నాకే ఏదో అనిపించి ఆయనను క్యారవాన్ లో కలిసి సారీ సార్ అని అంటే.. ఆయన లేచి మీరేంటి ఇలా.. ఫర్వాలేదు బాబు!! అని అన్నారు.. అంటూ నాని చెప్పుకొచ్చారు.
పరిశ్రమలో ఇన్ని సంవత్సరాల అనుభవజ్ఞుడు అంత లాయల్ గా ఉన్నారంటే అర్థం చేసుకోవచ్చు. లాయల్టీకి పెద్ద ఎగ్జాంపుల్ అంటే బాహుబలి కట్టప్ప కదా? అంతకంటే పెద్ద ఎగ్జాంపుల్ ఎవరైనా ఉన్నారా అంటే అది సత్య రాజ్ గారే. సినిమా అంటే అంత లాయల్ గా ఉంటారాయన అని తెలిపారు. మీరు స్టార్ డమ్ ని బిలీవ్ చేస్తారా? అన్న వేరొక ప్రశ్నకు సమాధానంగా.. స్టార్ డమ్ ని నమ్ముతా. కానీ ఆ పదానికి ఇప్పుడున్న అర్థాన్ని నమ్మను. కంటెంట్ వల్లే స్టార్ డమ్ వస్తుందని నమ్ముతాను. నేను నా కెరీర్ లో నాకు నచ్చినది చేసుకుంటూ వెళ్లపోతున్నా. నేనేం చేస్తున్నాను అన్నదే చూస్తున్నా. నేను చేసే ప్రతిదీ నాకే తెలియకుండా నా కెరీర్ కి ఉపయోగపడుతోంది. ఒక స్టెప్ ముందుకెళ్లాలి అని కాన్సియస్ గా చేయడం లేదు. నచ్చింది చేసుకుంటూ వెళుతున్నాను. అన్న రకాల సినిమాలు చేయాలన్న ఆలోచనతోనే చేస్తున్నానని నాని తెలిపారు.