షాకింగ్ ట్విస్ట్.. య‌ష్ రాజ్ బ్యాన‌ర్ లో అవికా

Update: 2022-04-23 08:30 GMT
ప్ర‌తి ఒక్క‌రి జీవితంలో ఒక ట్విస్టు కొన్ని మ‌లుపులు ఉంటాయి. ఆ ట్విస్టును క‌నిపెట్టి మ‌లుపును మేలిమి మ‌లుపుగా మార్చుకుంటే అటుపై జీవితంలోకి గోల్డెన్ డేస్ ప్ర‌వేశించిన‌ట్టే. ఇప్పుడు అలాంటి ట్విస్టు అవికా గోర్ జీవితంలోకి ప్ర‌వేశించింది. ఇది మేలిమి మ‌లుపా లేక హార‌ర్ ట్విస్టా? అన్న‌దానికి ఇక‌పై త‌న ప్రూవింగ్ ట్యాలెంటే సాక్ష్యంగా నిలుస్తుంది.

అవికా గోర్ కెరీర్ అంతంత మాత్ర‌మే. టాలీవుడ్ లో అగ్ర నాయిక అవ్వాల‌న్న క‌ల ఫ‌లించ‌ని సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం ఈ బ్యూటీ కెరీర్ పరంగా ఒడిదుడుకుల‌ను ఎదుర్కొంటోంది. ఇంత‌లోనే ఊహించ‌ని ట్విస్టు. ఇప్పుడు ఏకంగా ఎంద‌రో న‌వ‌త‌రం నాయిక‌లకు అవ‌కాశాలు క‌ల్పించిన య‌ష్ రాజ్ ఫిలింస్ లో అవ‌కాశం ద‌క్కించుకుంది. దొరికింది చిన్న చోటు మాత్ర‌మే అయినా ఇది నిజంగా త‌న‌కు గొప్ప వ‌రం అని చెప‌పాలి. ఈ చిత్రానికి '1920: హారర్స్ ఆఫ్ ది హార్ట్' అని టైటిల్ ని నిర్ణ‌యించారు. కృష్ణ భట్ దర్శకత్వం వహించనున్నారు.

హిందీ చిత్ర పరిశ్రమ ముఖ్యంగా హారర్ జానర్ లో బాగానే రాణిస్తోంది. అయితే 2008లో 1920 హార‌ర్ ట్రెండ్ ప‌రంగా ప్రజలలో ఆసక్తిని రేకెత్తించి కమర్షియల్‌గా విజయం సాధించింది. ఆ చిత్రంతోనే అందాల అదాశ‌ర్మ తెర‌కు ప‌రిచ‌య‌మైంది. రజనీష్ దుగ్గల్ - అదా శర్మ జంటగా నటించిన ఈ చిత్రానికి విక్రమ్ భట్ దర్శకత్వం వహించారు. ఇప్పుడు ఒక దశాబ్దం తర్వాత విక్రమ్ భట్ ఫ్రాంచైజీని కొన‌సాగిస్తూ ఇక‌పైనా ముందుకు తీసుకెళ్లడానికి సిద్ధంగా ఉన్నారు. 1920: హారర్స్ ఆఫ్ ది హార్ట్ పేరుతో రానున్న ఈ చిత్రంలో అవికా గోర్ నటిస్తుంది మరియు అతని కుమార్తె కృష్ణ భట్ దర్శకత్వం వహిస్తుంది.

శనివారం నాడు విక్రమ్ భట్ ఈ చిత్రాన్ని అధికారికంగా ప్రకటించడానికి తన ఇన్ స్టాగ్రామ్ హ్యాండిల్ కి వెళ్లారు. కృష్ణ- అవిక- మహేష్ భట్ లతో కలిసి ఈ చిత్రానికి రచన చేయనున్నారు. తాజా ఫోటోగ్రాఫ్ ని పంచుకుంటూ విక్రమ్ ఇలా రాసారు. 1920 నా జీవితంలో ఒక కొత్త అధ్యాయాన్ని ప్రారంభించింది. ఇప్పుడు 1920 నాటి మరో కథ హిందీ చిత్రాలలో అపారమైన ప్రతిభావంతులైన వారి కెరీర్ కోసం ప్రారంభమవుతుంది. అవికాగోర్ -ద గ్రిటీ గర్ల్ డైరెక్టర్ @కృష్ణవ్ భట్ 1920 - హార్రర్స్ ఆఫ్ ది హార్ట్ ను రాసారు. నా గురువు @మహేష్ గారు ఈ ఫిల్మ్ క‌థ‌ను వారితో క‌లిసి రాశారు - ఈసారి నేను నిర్మాతగా కొన‌సాగుతాను. అభివృద్ధి చెందుతున్న ప్రతిభకు రెక్కలు అందించాల‌ని.. ఉల్లాసంగా చేస్తున్న ప్ర‌య‌త్న‌మిది అని వెల్ల‌డించారు.

"నా జీవితాన్ని మార్చివేసి నన్ను దర్శకురాలిగా మార్చిన సినిమా - 1920 పార్ట్ 2! ఇప్పుడు ఒక దశాబ్ద కాలం తర్వాత నేను 1920 సీక్వెల్ ని డైరెక్ట్ చేస్తాను - నా ప్రధాన మహిళ @avikagor తో హార్రర్స్ ఆఫ్ ది హార్ట్ ! నా హృదయంతో..  ప్రేమతో దీన్ని రాసి నిర్మిస్తున్న నా గురువులు @vikrampbhatt - #MaheshBhatt లతో కలిసి దీన్ని రూపొందించడం చాలా ఉత్సాహంగా ఉంది" అని ద‌ర్శ‌కురాలు కృష్ణ తన ఇన్ స్టాలో వెల్ల‌డించారు.

1920 తర్వాత సీక్వెల్ గా '1920: ది ఈవిల్ రిటర్న్స్' పేరుతో సినిమాని తెర‌కెక్కించి విడుదల చేశారు. దీనికి ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన లభించింది. ఈ సిరీస్ ని ఇక‌పైనా కొన‌సాగిస్తుండ‌డం ఉత్కంఠ‌ను పెంచుతోంది.
Tags:    

Similar News