ఎన్టీఆర్ బయోపిక్ విడుదల దగ్గర పడే కొద్ది నందమూరి అభిమానుల్లో ఉత్సుకత పెరుగుతోంది. సంక్రాంతి రేస్ లో వస్తున్న మొదటి సినిమా కాబట్టి ఒక రకంగా దీని మీద ఒత్తిడి కూడా ఎక్కువగానే ఉంది. ఇకపోతే రెండు భాగాలుగా వస్తున్న ఎన్టీఆర్ బయోపిక్ ఫస్ట్ పార్ట్ కథానాయకుడి గురించి పెద్దగా ఎవరికి అనుమానాలు లేవు. కారణం అది పూర్తిగా నట జీవితానికి సంబంధించినది కాబట్టి మరీ ఎక్కువ మలుపులు ఉండకపోవచ్చు. దానికి తోడు ఎన్టీఆర్ పాత సినిమాల్లో రకరకాల గెటప్స్ తో క్యామియోలు పాటలు ఉంటాయి కాబట్టి అందులో పెద్దగా ఎత్తి చూపించడానికి ఏమి ఉండకపోవచ్చు.
అయితే అసలైన సవాల్ ఎన్టీఆర్ సెకండ్ పార్ట్ మహానాయకుడుకు ఎదురవుతుంది. ఆయన రాజకీయ జీవితానికి ముడిపడిన అంశం కాబట్టి చాలా వివాదాస్పద అంశాలు టచ్ చేయకుండా వదిలేసే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. ఒక వేళ చూపించాలి అనుకున్నా వైస్రాయ్ ఎపిసోడ్ తో మొదలుకుని ఆఖరి క్షణంలో లక్ష్మి పార్వతితో చేసిన ప్రయాణం వరకు అన్ని కవర్ చేయాలి. ఇదంతా ఎందుకు లెమ్మని మహానాయకుడు క్లైమాక్స్ ని కేవలం రెండో సారి ముఖ్యమంత్రి గా ప్రమాణస్వీకారం చేయడం దగ్గర ముగిస్తారట. అంటే అంతిమ ప్రస్థానం ఉండదని అర్థమైనట్టేగా.
ఈ లెక్కన నాదెండ్ల భాస్కర్ రావు ఉదంతం తప్ప చెప్పుకోదగ్గ కాంట్రావర్సీ మహానాయకుడు లో ఉండదన్న మాట. అదే లేనప్పుడు లక్ష్మి పార్వతి తో రెండో వివాహం ఉండే ఛాన్స్ లేదు. ఈ సస్పెన్స్ అంతా తొలగాలి అంటే ఇంకా ఖరారు చేయని మహానాయకుడు విడుదల తేదీ దాకా ఆగాల్సిందే. ఎన్నికల సంవత్సరం కాబట్టి వివాదాస్పద అంశాలకు చోటు లేకుండా దర్శకుడు క్రిష్ జాగ్రత్త పడినట్టు సమాచారం. ఈ నెల్ 21న ట్రైలర్ తో పాటు ఆడియో లాంచ్ ఒకేసారి జరగనుంది.