కరోనా ఎఫెక్ట్ : షూటింగులో నటీనటుల ఇబ్బందులు...!

Update: 2020-09-30 03:30 GMT
కరోనా మహమ్మారి కారణంగా ఏర్పడిన పరిస్థితుల నేపథ్యంలో సినీ ఇండస్ట్రీలో అనేక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. సినిమా షూటింగ్ దగ్గర నుంచి రిలీజ్ వేదిక వరకు అన్ని విషయాల్లో కొత్త పద్ధతులు వస్తున్నాయి. ఒకప్పుడు కొత్త సినిమాలు థియేటర్స్ లో విడుదల అవుతుంటే.. ఇప్పుడు డిజిటల్ ఫ్లాట్ ఫార్మ్స్ లో రిలీజ్ చేస్తున్నారు. ఇంతకముందు సినిమా రిలీజ్ కు ముందు ఉండే హంగామా ఇప్పుడు లేకుండా పోయింది. ఇక షూటింగ్ లో సమూల మార్పులు కనిపిస్తున్నాయి. సినిమా షూటింగ్ అంటే నటీనటులు.. ఎక్కువ మంది సిబ్బందితో సెట్ మొత్తం సందడి సందడిగా ఉండేది. అయితే ఇప్పుడు కొద్ది మాత్రమే సెట్స్ లో కనిపిస్తున్నారు. అందులోనూ షూటింగ్ లొకేషన్ లో ఉండే వారందరూ మాస్కులు శానిటైజర్స్ వంటి సేఫ్టీ మెజర్స్ తీసుకుంటూ కోవిడ్ గైడ్ లైన్స్ పాటిస్తూ ఉండాల్సి వస్తోంది. దీని వల్ల నటీనటులు ఇబ్బందులు పడుతున్నారని తెలుస్తోంది.

కేంద్ర ప్రభుత్వం షూటింగులకు అనుమతి ఇవ్వడంతో సినిమా షూటింగ్స్ స్టార్ట్ అవుతున్నాయి. ఇప్పటికే మెజారిటీ భాగం షూటింగ్ పూర్తి చేసుకున్న సినిమాలు ప్యాచ్ వర్క్ కంప్లీట్ చేసుకుంటున్నారు. అయితే ఈ మ‌ధ్య షూటింగ్స్ లో పాల్గొంటున్న హీరో హీరోయిన్లు ఆర్టిస్టులు కోవిడ్ నిబంధనలతో షూట్ చేయడంపై పెద‌వి విరుస్తున్నారని ఫిలిం సర్కిల్స్ లో చెప్పుకుంటున్నారు. సెట్స్ లో ఉన్నంతసేపు మాస్క్ పెట్టుకునే ఉండటం.. షాట్ కి షాట్ కి మాస్కులు తీయడం పెట్టుకోవ‌డం చేస్తూ ఉండటం వల్ల మ్యాకప్ లో షేడ్స్ క‌నిపించ‌డం.. మ‌ళ్లీ వాటి కోసం మేక‌ప్ ట‌చ్ అప్స్ చేయించుకోవ‌డం.. ఇలా అనేక ఇబ్బందులు పడుతున్నారట. వీటి కారణంగా వ‌ర్క్ మీద కాన్స‌న్ట్రేట్ చేయ‌లేక‌పోతున్నామ‌ని క‌ళ‌కారులు వాపోతున్నారని సమాచారం. అయితే కరోనా నేపథ్యంలో ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే మొదటికే మోసం వస్తుందనే విషయం మర్చిపోయారని కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇదిలా ఉండగా ఇప్పుడు షూటింగ్స్ చేస్తున్న నిర్మాతలకు డే టు డే ప్రొడ‌క్ష‌న్ ఖ‌ర్చు ఎక్కువ అవుతుందని తెలుస్తోంది. ఏదేమైనా కోవిడ్ వ‌ల్ల సినీ ఇండ‌స్ట్రీకి అపార‌మైన న‌ష్టం క‌లిగింద‌నే విష‌యం మాత్రం వాస్త‌వం.
Tags:    

Similar News