ఎన్నో అద్బుత సినిమాలను తెరకెక్కించి విమర్శకుల ప్రశంసలు దక్కించుకోవడమే కాకుండా ఇండస్ట్రీకి ఒకానొక సమయంలో దిశా నిర్థేశం చేసిన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఈమద్య చేస్తున్న సినిమాలన్నీ కూడా వివాదాస్పద కాన్సెప్ట్ లే. తాజాగా ఈయన దిశ ఎన్ కౌంటర్ అనే సినిమాను తెరకెక్కించాడు. రియల్ లైఫ్ ఇన్సిడెంట్ తో రూపొందిన ఈ సినిమా విడుదలకు సిద్దం అయ్యింది. థియేట్రికల్ రిలీజ్ కోసం ఈ సినిమా సెన్సార్ ముందుకు వెళ్లింది. సెన్సార్ బోర్డ్ వారు ఈ సినిమా కు కట్స్ చెప్పకుండా మొత్తం సినిమానే సెన్సార్ చేయలేమని చెప్పేశారట.
సినిమాలోని పలు సీన్స్ సెన్సార్ నియమ నిబంధనలకు విరుద్దంగా ఉన్నాయంటూ బోర్డు సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారని అంటున్నారు. గతంలో కూడా వర్మ సినిమాలకు ఇదే పరిస్థితి ఏర్పడింది. ఆ సమయంలో ఆయన సెన్సార్ బోర్డు పై చిన్నపాటి యుద్దమే చేశాడు. దాంతో ఈసారి కూడా మళ్లీ ఆయన యుద్దం చేయక తప్పదేమో అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు. వర్మ ఈ సినిమాకు ఖచ్చితంగా ఏదోలా సెన్సార్ అయితే తెప్పించుకుంటాడు. కోర్టుకు వెళ్లి లేదంటే కేంద్రం సెన్సార్ బోర్డ్ వద్దకు వెళ్లి అయినా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని సినిమాను విడుదల చేస్తాడు.
ఇలా సెన్సార్ కు నో చెప్పడం వల్ల ఆయన సినిమాకు మరింత పబ్లిసిటీ వస్తుందని దాన్ని తనకు ప్రయోజనకారిగా మార్చుకునే అవకాశం కూడా ఉందని ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. దిశ ఎన్ కౌంటర్ సినిమా విడుదల విషయమై రామ్ గోపాల్ వర్మ ఎలాంటి ప్రకటన చేస్తాడా అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాకు నట్టి కుమార్ నిర్మాతగా వ్యవహరించాడు.