నందమూరి నటసింహాన్ని ఆన్ స్క్రీన్ పై చూడాలంటే ప్రత్యర్ధులకు హడల్. ఆఫ్ స్క్రీన్ లోనూ బాలకృష్ణ నిండైన విగ్రహం గంభీరంగా కనిపిస్తుంది. అయితే.. ఆయనది మాత్రం చిన్నపిల్లల మెంటాలిటీ అని చాలామంది చెబుతూ ఉంటారు. కానీ.. తన చుట్టూ ఏదైనా తేడా జరిగితే మాత్రం అందరినీ హడలెత్తించేస్తాు. ఆయనకు అంత కోపం కూడా. అందుకే కొత్త వాళ్లు బాలయ్యతో చేసేందుకు ముందు భయపడుతుంటారు.
ఏజ్ 55 ఏళ్లు అయినా.. 20 ఏళ్ల అమ్మాయిల కంటే వేగంగా, యాక్టివ్ గా ఉండడం, కనిపించడం, స్టెప్పులు వేయగలగడం బాలకృష్ణ ఒక్కడికే సొంతం. అందుకే కుర్ర హీరోయిన్లు మాత్రం ఆయనతో మూవీ విషయంలో స్టార్టింగ్ లో కొంచెం కేర్ ఫుల్ గా ఉంటారు. కానీ తర్వాత ఈ భామలకు అసలు తత్వం బోధపడుతుంది. అసలు తాము ఇంతగా ఎందుకు భయపడ్డామా అని ఆశ్చర్యపోతూ ఉంటారు. రీసెంట్ గా బాలయ్యతో నటించిన సోనాల్ చౌహాన్ - శ్రద్ధా దాస్ లకు ఇలాంటి అనుభవమే ఎదురైంది. కొన్నాళ్లపాటు వీళ్లు రిజర్వ్డ్ గా ఉందామని ప్రయత్నించినా, బాలయ్య చురుకుదనం అల్లరి చూసి, ఇట్టే ఫ్రెండ్స్ అయిపోయారట. తను అంత పెద్ద స్టార్ - సీనియర్ హీరో అనే అరమరికలు లేకుండా కలిసిపోయే మనస్తత్వం చూసి ఆశ్చర్యపోయారట.
వీళ్లు బాలయ్యకి ఎంతగా ఫ్రెండ్స్ అయిపోయారంటే.. ఆయన్ని సంబోధించాల్సి వచ్చినపుడు బాలాసార్ - బాలాసార్ అని.. సగం పేరునే ఉపయోగిస్తున్నారు. సాధారణంగా ముందు బాలకృష్ణ గారు అనేవారు కూడా.. ఆయనతో కొన్నాళ్లు పనిచేయగానే బాలయ్య బాబు - బాలయ్య అనేస్తుంటారు. అంతగా తన తరువాతి జనరేషన్ తో కూడా కలిసిపోతారు బాలకృష్ణ. అందుకే.. తన తోటి స్టార్స్ అంతా మల్టీ స్టారర్స్ వైపు మళ్లుతున్నా.. ఆయన మాత్రం సోలో హీరోగా ఇరగదీసేస్తున్నారు.