కొన్ని సినిమాలుంటాయి. దెబ్బకు అందులో ఇన్వాల్వ్ అయిన వాళ్లందరి జీవితాలు మారిపోతుంటాయి. రేయ్.. ఆ తరహా సినిమానే. ఈ మూవీ కారణంగా ఎంతమంది ఎన్ని ఇబ్బందులు పడ్డారో చెప్పాల్సిన పని లేదు. దర్శక నిర్మాత వైవీఎస్ చౌదరి ఇండస్ట్రీ నుంచే అంతర్ధానమయ్యే పరిస్థితికి వచ్చాడు. హీరో సాయిధరమ్ తేజ్ తెరంగేట్రం మూడేళ్లు ఆలస్యమై.. ఒక దశలో అతడి కెరీర్ ఏమవుతుందో అన్న సందేహాలు నెలకొనే పరిస్థితి వచ్చింది. హీరోయిన్ సయామీ ఖేర్.. తొలి సినిమాతోనే టాలీవుడ్ నుంచి ప్యాకప్ చెప్పేయాల్సి వచ్చింది. ఇందులో విలన్ పాత్ర పోషించిన శ్రద్ధా దాస్ కూడా చాలానే ఇబ్బంది పడింది. ఆమె కెరీర్ కూడా క్లోజ్ అయ్యే పరిస్థితి వచ్చింది.
తాను కూడా ‘రేయ్’ దెబ్బకు టాలీవుడ్లో తన కెరీర్ ముగిసిపోయిందనే అనుకున్నానని చెబుతోంది శ్రద్ధ. ‘‘రేయ్ కోసం మూడేళ్లు కష్టపడ్డాం. చాలా సమయం ఎదురు చూశాం. కానీ మా ప్రయత్నం ఫలించలేదు. రేయ్ సినిమా రిజల్ట్ చూశాక నా కెరీర్ అయిపోయిందనే అనుకున్నాను. అలాంటి టైంలో కన్నడలో ‘పూజ’ సినిమా చేసే అవకాశం వచ్చింది. తర్వాత ప్రవీణ్ సత్తారు నాకు ‘గుంటూరు టాకీస్’లో అవకాశమిచ్చాడు. ఇలాంటి పాత్ర నేనింతవరకు చేయలేదు అనడం కంటే.. అసలు తెలుగులో ఇంకెవరూ కూడా ఇలాంటి క్యారెక్టర్ చేయలేదని అనగలను. అంత విచిత్రమైన పాత్ర రివాల్వర్ రాణి. నేనెందుకీ మాట అంటున్నానో సినిమా చూశాక అర్థమవుతుంది. హిందీలో కంగనా రనౌత్ పోషించిన రివాల్వర్ రాణి పాత్ర దీనికి స్ఫూర్తి’’ అని చెప్పింది శ్రద్ధాదాస్.