'మినీ ఫ్రాక్'లో గుండెలు గుల్లచేస్తోంది.. ఏక్ మినీ సుందరి!

Update: 2021-07-01 01:30 GMT
తెలుగు గ్లామర్ ప్రియులకు శ్రద్దాదాస్.. అనే గ్లామర్ బ్యూటీ పేరు పరిచయం అవసరం లేదు. ఎందుకంటే ఈ ముప్పై ఏళ్ల ముంబై వయ్యారి తెలుగు ప్రేక్షకులకు బాగా తెలుసు. ముంబైలోనే పుట్టి పెరిగిన శ్రద్ధా కాలేజీ టైంలో యాక్టింగ్ వైపు ఆసక్తి ఏర్పడి ఫ్యాషన్ ఫీల్డ్ లో అడుగుపెట్టింది. అయితే 'సిద్ధు ఫ్రం శ్రీకాకుళం' అనే చిత్రంతో హీరోయిన్ గా తెలుగు ఇండస్ట్రీలో అరంగేట్రం చేసింది. ఈ సినిమాతోనే శ్రద్ధా సినీ కెరీర్ ప్రారంభించింది. కానీ ముందుగా గ్లామర్ ఫిగర్ గానే పేరు తెచ్చుకుంది. అసలు ఫస్ట్ మూవీ నుండే అదిరిపోయే గ్లామర్ షో చేసింది. శ్రద్ధా ఇండస్ట్రీలో అడుగుపెట్టి 12ఏళ్లు పైనే అవుతోంది.

ఇప్పటివరకు తెలుగులో చాలా సినిమాలే చేసింది కానీ అమ్మడికి తగిన గుర్తింపు రాలేదనే చెప్పాలి. కానీ గ్లామర్ పరంగా మాత్రం బాగానే క్రేజ్ సొంతం చేసుకుంది. అలాగని శ్రద్దా గ్లామర్ షో తెలుగుతోనే ఆగిపోలేదు. అటు తమిళం కన్నడ మలయాళంతో పాటు బాలీవుడ్ లో కూడా కుర్రకారును మాయచేస్తోంది. కానీ ఇన్నేళ్ళైనా సరైన బ్రేక్ రాక ఇంకా తనను తను ప్రూవ్ చేసుకునే ప్రయత్నాలలో ఉండిపోయింది అమ్మడు. కొంతకాలంగా గ్యాప్ లేకుండా సినిమాలు చేస్తోంది కానీ మెయిన్ హీరోయిన్ గా కాదు. సెకండ్ లేదా సైడ్ క్యారెక్టర్స్ చేస్తోంది.

ప్రస్తుతం శ్రద్దా చేతిలో పలు ప్రాజెక్ట్స్ ఉన్నాయట. నటిగా బిజీ కానప్పటికి గ్లామర్ బ్యూటీగా మాత్రం చాలా ఫేమస్. తన హాట్ అందాలతో దేశవ్యాప్తంగా ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకుంది. సోషల్ మీడియాలో శ్రద్దా అందాలకై ఎదురుచూసే ఫ్యాన్స్ మిలియన్స్ లో ఉన్నారు. ఇన్నేళ్లలో శ్రద్ధా చేసిన అన్ని పాత్రలు రొమాన్స్ తో కూడుకున్నవే. ఇటీవలే తెలుగులో 'ఏక్ మినీ కథ' అనే సినిమాలో నటించింది. ఇదిలా ఉండగా.. తాజాగా శ్రద్దా వైట్ మినీ ఫ్రాక్ లో పోజిచ్చింది. ఆ పోజులో వయ్యారి అందాలన్నీ రెట్టింపు అందంతో మెరిసిపోతున్నాయి. ముఖ్యంగా శ్రద్ధా థైస్ కుర్రాళ్లకు మతులు పోగొడుతున్నాయని కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి స్టైలిష్ హెయిర్ స్టయిల్ తో క్యూట్ గా మురిపిస్తుంది ముంబై సోయగం. ప్రస్తుతం పిక్ నెట్టింట వైరల్ అవుతుంది.
Tags:    

Similar News