ఫోటో స్టోరి: 2020 షోస్టాపర్ వ‌ధువు‌.. కలల్లో కల్లోల‌మే

Update: 2020-10-14 08:30 GMT
సాహో చిత్రంతో తెలుగు యువ‌త‌కు కంటిమీద కునుకు ప‌ట్ట‌నీకుండా చేసింది శ్ర‌ద్ధా క‌పూర్. సినిమా ఆశించినంత రేంజుకు చేర‌క‌పోయినా శ్ర‌ద్ధా అంద‌చందాలు మాత్రం క‌ట్టిప‌డేశాయి. డార్లింగ్ ప్ర‌భాస్ ఏరికోరి ఈ ఆషిఖి 2 బ్యూటీనే ఎందుకు ఎంచుకున్నాడు? అన్న‌దానికి తెర‌పై స‌మాధానం ల‌భించింది. యంగ్ లేడీ కాప్ పాత్ర‌లో శ్ర‌ద్ధా చ‌క్క‌గా ఇమిడిపోయి నటించింది. ఆ సినిమా త‌ర్వాత మ‌ళ్లీ తెలుగులో క‌నిపించ‌లేదు.

ప్ర‌స్తుతం హిందీ ప‌రిశ్ర‌మ‌లోనే క్ష‌ణం తీరిక లేకుండా ఉన్న ఈ అమ్మ‌డు సౌత్ కి రావ‌డం అంత సులువేమీ కాదు. ఇక్క‌డ మ‌రో సినిమాకి సంత‌కం చేయ‌డం అంటే ఆషామాషీ కానేకాదని అర్థ‌మ‌వుతోంది. ఓవైపు సినిమాలు మ‌రో వైపు ర్యాంప్ షోల‌తో ఈ ట్యాలెంటెడ్ బ్యూటీ నిరంత‌రం బిజీ బీజీ. ముంబై ని త‌న‌దైన స్టైల్ ఫ్యాష‌న్ ప్ర‌పంచంతో అట్టుడికిస్తున్న ఈ బ్యూటీ లేటెస్టుగా రెడ్ లెహెంగాలో వ‌ధువు రూపంలో ప్ర‌త్య‌క్ష‌మైంది.

2020 షోస్టాపర్ వ‌ధువు‌.. కలల్లో కల్లోల‌మే అంటూ కామెంట్లు ప‌డిపోతున్నాయ్ ఈ లెహెంగా లుక్ చూశాక‌. శ్ర‌ద్ధా స్ట్రైకింగ్ లుక్ తో క‌ట్టి ప‌డేసింది. ఇక న‌వ‌వ‌ధువుగా ఈ అమ్మడి అందానికి ప‌రేషాన్ కావాల్సిందే. ఇలా ఏడు రోజుల పాటు ర్యాంప్ వాక్ లో ర‌క‌ర‌కాల లెహంగాలు ధ‌రించ‌నున్నాన‌ని తెలిపింది అమ్మ‌డు. కపూర్ ఇటీవల ఈ రెగల్ రెడ్ లెహంగా చిత్రాలను పంచుకుంది. ఈ డ్రెస్ లో ఒక ఆధునిక భారతీయ వధువులా కనిపించింది. ఈ చిత్రాలు ఇండియా కోచర్ వీక్ లో మొట్టమొదటి డిజిటల్ రాంప్ నడక నుండి బ‌య‌ట‌కు వచ్చాయి. ఎర్ర పెళ్లి లెహంగా వధువులందరికీ ప్రేరణనివ్వ‌డం ఖాయంగానే క‌నిపిస్తోంది.
Tags:    

Similar News