దాదాపు నాలుగేళ్ల విరామం తరువాత షారుక్ ఖాన్ నటించిన యాక్షన్ స్పై థ్రిల్లర్ 'పఠాన్'. సిద్ధార్ధ్ ఆనంద్ దర్శకత్వం వహించాడు. దీపిక పదుకునే హీరోయిన్ గా నటించిన ఈ మూవీలో జాన్ అబ్రహం విలన్ గా నటించాడు. యష్ రాజ్ ఫిలింస్ బ్యానర్ పై ఆదిత్య చోప్రా అత్యంత భారీ స్థాయిలో ప్రతీష్టాత్మకంగా నిర్మించిన సినిమా ఇది. గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ మూవీని జనవరి 25న అత్యంత భారీ స్థాయిలో రిలీజ్ చేస్తున్నారు.
హిందీతో పాటు ఈ మూవీని తెలుగు, తమిళ భాషల్లోనూ రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా సెన్సార్ వారు సినిమా చూశారు. యు/ఏ సర్టిఫికెట్ ని ఇచ్చారు. రన్ టైమ్ ని కూడా కుదించారని తెలిసింది. 'పఠాన్' ఫైనల్ రన్ టైమ్ 146.16 (రెండు గంటల 26 నిమిషాల 16 సెకన్లు).
ఇక సోషల్ మీడియాలో వివాదాస్పదంగా మారిన వైరల్ గా మారిన 'బేషరమ్ రంగ్' సాంగ్ పాటకు మూడు కట్స్ విధించారట. దీపిక పదుకునే అందాల ఆరబోతపై వచ్చిన విమర్శల్ని దృష్టిలో పెట్టుకున్న సెన్సార్ బోర్డ్ దీపిక గోల్డెన్ స్విమ్ సూట్ లో వున్న మూడు క్లోజప్ షాట్స్ కు, కొన్ని డ్యాన్స్ మూవ్ మెంట్స్ లలో మార్పులు చేశారట.
టోటల్ గా ఈ మూవీకి 10 కట్స్ విధించినట్టుగా తెలుస్తోంది. అంతే కాకుండా పలు సంభాషణల్లోనూ సూచనలు చేసినట్టుగా చిత్ర బృందం తెలిపింది. రిలీజ్ సమయానికి సెన్సార్ వారు చెప్పిన మార్పులతో సినిమాను రిలీజ్ చేస్తామని మేకర్స్ వెల్లడించారు. సినిమా రిలీజ్ కు మరో నాలుగు రోజులే వుండటంతో చిత్ర బృందం ప్రమోషన్స్ ని స్పీడప్ చేసింది. ఇక దర్శకుడు సిద్ధార్ధ్ ఆనంద్ సినిమాలో వున్న యాక్షన్ ఘట్టాలపై ఈ సందర్భంగా వెల్లడించాడు.
పఠాన్ లోని యాక్షన్ ఘట్టాలు ఒళ్లు గగుర్పొడిచే విధంగా వుంటాయని, అవి వెండితెరపై చూస్తే అద్భుతంగా అనిపిస్తాయన్నాడు. అయితే ఈ మూవీ సెన్సార్ వారు 10 కట్స్ విధించడంపై హీరోయిన్ శ్రేయాస్ ధన్వంతరీ తీవ్రంగా స్పందించింది. ఇది హాస్యాస్పదంగా వుందని సెన్సార్ సభ్యులపై తీవ్ర స్థాయిలో మండిపడింది.
మా అద్భుతమైన ప్రేక్షకులకు వారు ఏమి చూడాలనుకుంటున్నారో నిర్ణయించే శక్తిని ఇవ్వండి. వారికి ఏదైతే నచ్చకపోతే వారే టికెట్ లు కొనరు. ఈ హాస్యాస్పదమైన సెన్సార్ షిప్ ని ఆపేయండి' అంటూ శ్రేయాస్ ధన్వంతరి సోషల్ మీడియా ట్విట్టర్ వేదికగా ఫైర్ అయింది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.